Covid Trash Sale: అక్రమంగా కొవిడ్ బయోమెడికల్ వేస్టేజ్ అమ్మకాలు

కొవిడ్ బయోమెడికల్ వేస్టేజ్ అక్రమ అమ్మకాలపై ప్రముఖ మీడియా జరిపిన ఇన్వెస్టిగేషన్ గంటల విరామంతోనే విషయం ఢిల్లీ హెల్త్ మినిష్టర్ వరకూ చేరింది. ఈ క్రమంలో మంత్రి సత్యేందర్ జైన్ సరైన యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Covid Trash Sale: అక్రమంగా కొవిడ్ బయోమెడికల్ వేస్టేజ్ అమ్మకాలు

Covid Trash Sale

Covid Trash Sale: కొవిడ్ బయోమెడికల్ వేస్టేజ్ అక్రమ అమ్మకాలపై ప్రముఖ మీడియా జరిపిన ఇన్వెస్టిగేషన్ గంటల విరామంతోనే విషయం ఢిల్లీ హెల్త్ మినిష్టర్ వరకూ చేరింది. ఈ క్రమంలో మంత్రి సత్యేందర్ జైన్ సరైన యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు.

‘ఒకవేళ ఇది జరుగుతున్నట్లయితే ముమ్మాటికి తప్పే. బయోమెడికల్ వేస్ట్ డిస్పోజ్ చేయడమనేది ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కనీస బాధ్యత. ఏదైనా ఉంటే నాకు చెప్పండి తగ్గ యాక్షన్ తీసుకుంటాం. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ తోనూ మాట్లాడి తగు చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.

అసలేం జరిగిందంటే:
కొవిడ్ ట్రీట్మెంట్ కు వాడిన బయోమెడికల్ వేస్టేజ్ పెద్ద మొత్తంలో అమ్మకం జరుపుతున్నట్లు తెలిసింది. భోపురలోని ఢిల్లీ-ఘాజియాబాద్ సరిహద్దుల్లో ప్రొటెక్టివ్ గేర్ తో ఓపెన్ కాంపౌండ్ లోనే వాటిని ఆరబెడుతున్నారు. వర్కర్లు, ఆపరేటర్లు ఈ వేస్ట్ మొత్తాన్ని లోకల్ రిటైలర్లకు రీసైకిల్ యూనిట్ల కోసం అమ్మేందుకు రెడీ చేస్తున్నట్లు తెలిపారు.

మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఇండియాలో 203 టన్నుల కొవిడ్ మెడికల్ వేస్టేజ్ జనరేట్ అయిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెప్పింది. 2021 మే 10వరకూ వచ్చిన ఈ డేటా మహమ్మారి కారణంగా పేరుకుపోయిన చెత్తలో 20శాతంగా ఉందని రికార్డులు చెబుతున్నాయి. ఢిల్లీలో రోజుకు 18.79టన్నుల నమోదవగా ఉత్తరప్రదేశ్‌లో 15.91టన్నులు నమోదైందని సీపీసీబీ సంఖ్యలు చెబుతున్నాయి.