దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

  • Published By: vamsi ,Published On : March 1, 2019 / 10:30 AM IST
దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

పాకిస్తాన్ కు చెందిన మహిళను రెండువారాల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ కు చెందిన 37ఏళ్ల మహిళ  2005లో భారత్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె భారత్ లో ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకుకు 11ఏళ్లు ఉండగా.. చిన్న కొడుకుకి ఐదేళ్లు. అయితే, ఆమెకు వ్యతిరేకంగా వచ్చిన కొన్ని భద్రతాపరమైన రిపోర్టులను పరిగణనలోకి తీసుకున్న భారత ప్రభుత్వం ఆమెను దేశం విడిచి పోవలసిందిగా నోటీసులు జారీ చేసింది.
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

అయితే, ఆ నోటీసును కొట్టేయాలంటూ ఆ మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను పెళ్లయినప్పటి నుంచి ఇప్పటి వరకు భర్తతో కలసి ఉంటున్నానని, దీర్ఘకాల వీసాపై భారత్‌లో ఉంటున్నట్లు వెల్లడించింది. 2015 నుంచి 2020 వరకు తనకు వీసా పర్మిట్ ఉందని స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ మహిళ వేసిన పిటీషన్ ను విచారించిన జస్టిస్ విభు బక్రు కొట్టేశారు. ఆ మహిళకు వ్యతిరేకంగా భద్రతకు సంబంధించిన పలు నివేదికలు వచ్చాయని అదనపు సొలిసిటర్ జనరల్ మహిందర్ ఆచార్య, కేంద్ర స్టాండింగ్ కమిటీ అధికారి అనురాగ్ అహ్లువాలియా వాదనలు వినిపించగా రిపోర్టులను కోర్టుకు చూపించి వాదించగా కోర్టు వారితో ఏకీభవించింది.
Read Also : ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట : పాక్ డిమాండ్

కేంద్ర హోంశాఖ కూడా అందుకే నోటీసులు జారీ చేసినట్లు వాళ్లు తెలియజేశారు. ఆమె ఫిబ్రవరి 22 నాటికే భారత్ విడిచి వెళ్లాల్సి ఉందని, వాదనలను విన్న న్యాయస్థానం… ఆమె దేశం విడిచి వెళ్లాల్సిందేనంటూ తీర్పు చెప్పింది. అందుకు ఆమెకు రెండు వారాల గడువు ఇచ్చింది. ఈలోపు దేశం విడిచి వెళ్లకూపోతే ఆమెపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు చెప్పింది. భారత్ లో ఎంట్రీకి జీవితకాల నిషేదం విధించే అవకాశం కూడా ఉన్నట్లు కోర్టు వెల్లడించింది.
Read Also : ఆధార్ అప్ డేట్ : ఇకపై ఆ మూడింటికీ తప్పనిసరి