Delhi liquor Scam : మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు .. సుప్రీంకోర్టుకు వెళతారా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీహార్ జైల్లో ఉంటున్న మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సిసోడియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని వ్యాఖ్యానించింది.

Delhi liquor Scam :  మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు .. సుప్రీంకోర్టుకు వెళతారా..?

Manish Sisodia Bail Petition

Delhi liquor scam.. Delhi High court : ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉంటున్న ఆప్ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish sisodia)కు ఢిల్లీ హైకోర్టు ( Delhi High court)లో చుక్కెదురైంది. సిసోడియా బెయిల్ పిటీషన్ (Bail Petition)ను ధర్మాసనం తిర్కరించింది. సిసోడియా బెయిల్ పిటీషన్ పై మంగళవారం (మే 30,2023)విచారణ చేపట్టిన జస్టిస్ దినేష్ కుమార్ శర్మ (Justice Dinesh Kumar Sharma)తో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఆయన బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిసోదియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని..ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని..కాబట్టి బెయిల్‌ ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. సాక్షులలో ఎక్కువమంది ప్రభుత్వ సేవలకే ఉన్నారని కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేస్తారనే అభిప్రాయాలను తోసిపుచ్చలేమని కోర్టు పేర్కొంటూ బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది.

కోర్టులో జరిగిన వాదనల్లో భాగంగా సిసోడియా తరపు న్యాయవాది దయన్ కృష్ణన్ ఎక్సైజ్ పాలసీని రూపొందించటంలోను..అమలు చేయటంలోను జరిగిన అవకతవకల్లో తన క్లైంట్ ప్రమేయం ఉన్నట్లుగా సీబీఐ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని వాదించారు. ఈకేసులో తన క్లైంట్ సిసోడియా మినహా మిగిలిన నిందుతులు అందరు బెయిల్ పై విడుదల అయ్యారని ఈ సందర్భంగా కోర్టుకు గుర్తుచేశారు. ఈ వాదనలు విన్న జస్టిస్ దినేష్ కుమార్ శర్మ వాటిని తోసిపుచ్చారు. సిసోదియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని సాక్షాలను తారుమారు చేయవచ్చని వ్యాఖ్యానిస్తు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. హైకోర్టులో బెయిల్ తిరస్కరించిన క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లుగా సమాచారం.

మద్యం కుంభకోణం (Delhi liquor scam) కేసులో అరెస్టయిన మనీశ్‌ సిసోదియా (Manish sisodia) 2023 ఫిబ్రవరి 26న సీబీఐ (CBI) అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా..న్యాయస్థానం సీబీఐ కస్టడికి అప్పగించింది. ఆ తరువాత సిసోడియాకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించడంతో తిహార్ జైలుకు తరలించారు. ఇటీవల ఆయన కస్టడీని ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు జూన్‌ 1వ తేదీ వరకు పొడిగించింది. ఈ క్రమంలో బెయిల్ పిటీషన్ తిరస్కరణతో సిసోడియాను తిరిగి తీహార్ జైలుకు తరలించనున్నారు.