ఢిల్లీలో మరోసారి భూకంపం 

  • Published By: murthy ,Published On : June 8, 2020 / 10:50 AM IST
ఢిల్లీలో మరోసారి భూకంపం 

దేశరాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. సోమవారం మధ్యాహ్నం  వేళ భూమి స్వల్పంగా కంపించటంతో ప్రజలు రోడ్లపైకి  పరుగెత్తుకు వచ్చారు. హర్యానాలోని గురుగావ్ కు 13 కిలోమీటర్ల  దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు గుర్తించారు.

రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత2.1 గా నమోదైంది. దీనివల్ల ఎటువంటి ప్రాణ ఆస్తినష్టం సంభవించలేదు.న్యూ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గత 10 రోజుల్లో స్వల్పంగా భూమి కంపించటం ఇది 16వ సారి. గత 3ఏళ్లుగా ఢిల్లీ హర్యానా పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపిస్తోందని…ఇక ముందు కూడా ఇలాంటివి జరుగుతాయని సిస్మాలజిస్టులు చెపుతున్నారు.

దేశంలో ఎక్కువగా భూ ప్రకంపనలు జరిగే ప్రదేశాల్లో ఢిల్లీ నాలుగవదిగా నిలిచింది. హిమాలయన్‌ ప్లేట్‌ ఉత్తర-ఈశాన్య దిశలో కదులుతూ యురేషయన్‌ ప్లేట్‌ కింద స్థిరపడే ప్రయత్నం జరుగుతున్నదని, అందువలన బలహీనమైన మండలాల వంఎట పరుగులు తీసినప్పుడు ప్లేట్లకు చాలా శక్తి ఉండి భూమికి పగుళ్లు ఏర్పడతాయని ఎన్‌సీఎస్‌ సిస్మాలజిస్ట్‌ ఏపీ పాండే వెల్లడించారు.

Read: షాకింగ్ న్యూస్ : సామాన్యుడి ఇంటికి రూ.80 లక్షల కోట్లు బిల్లు!!