Delhi : ఢిల్లీలో ఆక్సిజన్ లేక..8 మంది మృతి

ఢిల్లీలోని Batra Hospital 2021, మే 01వ తేదీ శనివారం ఉదయం ఆక్సిజన్ సరఫరా అందలేదు. ఆక్సిజన్ అందక..8 మంది మృత్యువాత పడ్డారు.

Delhi : ఢిల్లీలో ఆక్సిజన్ లేక..8 మంది మృతి

Delhi hosptial

Oxygen : దేశ రాజధానిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వేలాదిగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదే సంఖ్యలో మరణాలు ఉంటుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా…ఫలితాలు కనిపించడం లేదు. ప్రధానంగా ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు.

తాజాగా..ఢిల్లీలోని Batra Hospital 2021, మే 01వ తేదీ శనివారం ఉదయం ఆక్సిజన్ సరఫరా అందలేదు. ఆక్సిజన్ అందక..8 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో సీనియర్ డాక్టర్ కూడా ఉన్నారు. 80 నిమిషాలు ఆక్సిజన్ సరఫరా ఆలస్యం కావడంతో రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన డాక్టర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ఆర్కే Himthaniగా గుర్తించారు. 230 మంది 80 నిమిషాల సేపు ఆక్సిజన్ లేకుండా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు కోవిడ్ సంక్షోభంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఉదయం 11.45 గంటలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయిందని, మధ్యాహ్నం 1.30 గంటలకు ఆక్సిజన్ వచ్చిందని ఆసుపత్రి యాజమాన్యం కోర్టుకు వెల్లడించింది.ఢిల్లీలోని Batra Hospital 2021, మే 01వ తేదీ శనివారం ఉదయం ఆక్సిజన్ సరఫరా అందలేదు. ఆక్సిజన్ అందక..8 మంది మృత్యువాత పడ్డారు.ఢిల్లీలోని Batra Hospital 2021, మే 01వ తేదీ శనివారం ఉదయం ఆక్సిజన్ సరఫరా అందలేదు. ఆక్సిజన్ అందక..8 మంది మృత్యువాత పడ్డారు.