High Alert : కొత్త ‘ఓమిక్రాన్’ వేరియంట్.. ఢిల్లీలో ఆస్ప‌త్రుల‌కు హైఅల‌ర్ట్‌..!

ప్రపంచదేశాలను మరో కరోనా కొత్త వేరియంట్ వణికిస్తోంది. డేంజరస్ వేరియంట్ ఓమిక్రాన్ విదేశాల్లో విజృంభిస్తోంది. ఢిల్లీలోని ఆస్పత్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ హైఅలర్ట్ ప్రకటించింది.

High Alert : కొత్త ‘ఓమిక్రాన్’ వేరియంట్.. ఢిల్లీలో ఆస్ప‌త్రుల‌కు హైఅల‌ర్ట్‌..!

Delhi Hospitals Asked To Stay Alert Over New Variant 'omicron'

Delhi Hospitals High Alert : ప్రపంచదేశాలను మరో కరోనా కొత్త వేరియంట్ వణికిస్తోంది. డెల్టా వేరియంట్ కన్నా డేంజరస్ వేరియంట్ ఒకటి (Omicron) బయటి దేశాల్లో విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వేరియంట్ తమ దేశాల్లో రాకముందే భారత్ సహా ఇతర దేశాలన్నీ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉదయం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కొత్త వేరియంట్ వ్యాప్తిని ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై అధికారులతో మోడీ చర్చించారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని ఆస్పత్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. కరోనావైరస్ భద్రతా చర్యలను చేపట్టాల్సిందిగా అధికారులకు సూచించింది.

నగరంలోని బహిరంగ ప్రదేశాలు, ఫంక్షన్లలో అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ జాతీయ రాజధాని ప్రధాన కార్యదర్శి, పోలీసు కమిషనర్ ఇతర సీనియర్ అధికారులకు సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా ఆస్పత్రుల్లో పూర్తి సంసిద్ధత ఉండేలా చూడాలని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వైరాలజిస్టుల ప్రకారం.. అసాధారణ స్థాయిలో పెద్ద సంఖ్యలో మ్యుటేషన్లు కలిగిన ఈ వేరియంట్ కేసులను పలు దేశాల్లో నమోదవుతున్నాయి.

ఈ క్రమంలో విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నిపుణులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, జింబాబ్వే, హాంకాంగ్‌ల నుంచి తిరిగి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని, అలాగే వారిని క్వారంటైన్‌ చేయడంపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కరోనావైరస్ కొత్త వేరియంట్ కారణంగా ప్రభావితమైన దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలను నిలిపివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.


కరోనావైరస్ మహమ్మారి నుంచి దేశం చాలా కష్టంగా కోలుకుంది. అలాంటి మన దేశంలోకి కొత్త వేరియంట్‌ వ్యాప్తిచెందకుండా సాధ్యమైనంత తొందరగా కట్టడి చేయాలని సీఎం కేజ్రీవాల్ నొక్కి చెప్పారు. కొత్త వేరియంట్‌తో ప్రభావితమైన దేశాల నుంచి వచ్చే విమానాలను వెంటనే నిలిపివేయాలని మోడీని కోరుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియాలోని దేశాలను నిఘాను పెంచాలని, ప్రజారోగ్యం, భద్రతా చర్యలను బలోపేతం చేయాలని టీకాలను పెంచాలని కోరింది. పండుగలు, వేడుకల్లో ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని, పెద్ద సమావేశాలకు దూరంగా ఉండాలని గ్లోబల్ హెల్త్ నివేదించింది.

Read Also : South Africa Returnees : దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరికి కరోనా