Delhi IAS Couple : పెంపుడు కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ చేయించిన ఐఏఎస్ జంట బదిలీ
అధికార దుర్వినియోగం అనే మాట సాధారణంగా రాజకీయ నాయకులు విషయంలో వింటుంటాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులు పైగా ఐఏఎస్ స్థాయిలో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎలా ఉంటుందో ఢిల్లీలోని ఓ ఐఏఎస్ జంటను చూసి తెలుసుకోవచ్చు అనేలా ఉంది వారి వ్యవహారం. కేవలం వారి పెంపుడు కుక్క కోసం స్టేడియంలో క్రీడాకారుల్ని ప్రాక్టీసు చేసుకోనివ్వకుండా వారిని వెళ్లగొట్టిన ఘటన ఫలితంగా సదరు ఐఏఎస్ జంటపై బదిలీ వేటు పడింది.

Delhi IAS Couple Reason For Kutta Trend After Stadium Controversy : అధికార దుర్వినియోగం అనే మాట సాధారణంగా రాజకీయ నాయకులు విషయంలో వింటుంటాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులు పైగా ఐఏఎస్ స్థాయిలో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎలా ఉంటుందో ఢిల్లీలోని ఓ ఐఏఎస్ జంటను చూసి తెలుసుకోవచ్చు అనేలా ఉంది వారి వ్యవహారం. కేవలం వారి పెంపుడు కుక్క కోసం స్టేడియంలో క్రీడాకారుల్ని ప్రాక్టీసు చేసుకోనివ్వకుండా వారిని వెళ్లగొట్టిన ఘటన ఫలితంగా సదరు ఐఏఎస్ జంటపై బదిలీ వేటు పడింది.
పెంపుడు కుక్కను ఈవినింగ్ వాక్ కోసం స్టేడియంలోకి తీసుకెళ్లడం..ఆ ఐఏఎస్ జంట కోసం నిర్వాహకులు అథ్లెట్లను ఖాళీ చేయించిన సంఘటన గురువారం (మే 26,2022) నిన్నంతా ఈ వ్యవహారం దేశ రాజధానిలో హీట్ పుట్టించింది. విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగగా.. ఆ జంటపై ఆఘమేఘాల మీద ‘బదిలీ’ చర్యలు తీసుకుంది కేంద్ర హోం శాఖ.
అయితే ఈ జంట వ్యవహారం ఇప్పుడు ట్విటర్‌లో కొత్త ట్రెండ్‌కు దారి తీసింది. ఈ ఉదయం నుంచి #Kutta హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఐఏఎస్ జంట అయిన సంజీవ్ ఖీరావర్, రింకూ దుగ్గను చెరో ప్రాంతానికి బదలీ చేసింది కేంద్ర హోం వ్యవహారాల శాఖ. ఖీరావర్‌ను లడఖ్, దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్‌ను బదిలీ చేస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకుగానూ ఈ పనిష్మెంట్ విధించింది.
ఢిల్లీలో పెంపుడు కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ చేయించిన ఐఏఎస్ జంట బదిలీ శునకంతో కలసి వాకింగ్ చేసుకునేందుకు స్టేడియంను ఖాళీ చేయించిన ఐఏఎస్ జంటపై కేంద్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంకు ఇటీవల ఒక రోజు సాయంత్రం ఢిల్లీ రెవెన్యూ శాఖ సెక్రటరీ సంజీవ్ ఖిర్వార్, ఆయన భార్య రింకూ దుగ్గా వాకింగ్ కోసం వెళ్లారు. వీరి రాకతో స్టేడియంను ముందే ఖాళీ చేసి వెళ్లిపోవాలని అక్కడున్న అథ్లెట్లు, కోచ్ లను సిబ్బంది కోరారు. సాయంత్రం 7 గంటల్లోపు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆ తర్వాత ఖాళీ స్టేడియంలో ఐఏఎస్ దంపతులు పెంపుడు కుక్కతో కలసి నడుస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది.
ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నుంచి నివేదిక తెప్పించుకుంది. అనంతరం సంజీవ్ ఖిర్వార్ ను లడఖ్ కు , ఆయన భార్య రింకూ దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్ కు బదిలీ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇద్దరూ 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారులే. అయితే, రోజువారీ అధికారికంగా సాయంత్రం 7 గంటలకు స్టేడియంను మూసివేస్తుంటామని త్యాగరాజ స్టేడియం అడ్మినిస్ట్రేటర్ అజిత్ చౌదరి స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని స్టేడియంలను రాత్రి 10 గంటల వరకు అథ్లెట్లు, శిక్షకుల కోసం తెరిచే ఉంచాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు.
అయితే, దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఐఏఎస్ దంపతులను తలో దిక్కుకు పంపిస్తే వారు పెంచుకునే కుక్క పరిస్థితి ఏం కాను? అని ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఎవరు వాకింగ్ కు తీసుకెళతారు? కుక్క లడఖ్ వెళ్లాలా? లేక అరుణాచల్ వెళ్లాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.
- Wife Killed: అన్నం వడ్డించలేదని భార్యను చంపి శవం పక్కనే నిద్రపోయిన భర్త
- Agnipath: రేపు జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగనున్న కాంగ్రెస్
- Nupur Sharma: నుపుర్ శర్మ జాడ తెలియట్లేదు: మహారాష్ట్ర ప్రభుత్వం
- Enforcement Directorate: సత్యేందర్ జైన్ ఇళ్లు, కార్యాలయాల్లో మళ్లీ ఈడీ సోదాలు
- Justice For Sister: చెల్లికి న్యాయం చేయాలంటూ మళ్లీ ఢిల్లీ బాట పట్టిన అన్న
1Draupadi Murmu : ఎవరీ ద్రౌపది ముర్ము..? టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ప్రస్థానం
2Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లాకే ఏపీ కేబినెట్ ఆమోదం
3Ranji Trophy: సెంచరీ బాది అచ్చం కేఎల్ రాహుల్లా చేసిన యశ్ దుబే.. వీడియో
4Dil Raju : ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో దిల్ రాజు సమావేశం.. వేతనాలు కొలిక్కి వచ్చినట్టేనా??
5Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు
6Prabhudeva : మాస్టర్.. ఓ మై మాస్టర్ అంటున్న మై డియర్ భూతం..
7Maharashtra politics : రెబెల్ ఎమ్మెల్యేలు క్యాంప్ వేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద హైడ్రామా..శివసేన నేత సంజయ్ బోస్లే అరెస్ట్..
8Afghanistan earthquake: అఫ్గానిస్థాన్‌కు భారత్ సాయం
9Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు
10Gopichand : ప్రభాస్ అడిగితే మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయడానికి రెడీ..
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?
-
YCP Support : ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు
-
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ భేటీ..పలు కీలక నిర్ణయాలు!
-
Draupadi Murmu : నేడే ద్రౌపది ముర్ము నామినేషన్
-
iPhone 13 Offer : తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్.. వారికి మాత్రమేనట..!
-
Jio, Airtel, Vi : రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. వ్యాలిడిటీ ఎంతంటే?