కరోనా ఎఫెక్ట్..మాస్క్ పెట్టుకుని పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ 

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 10:09 AM IST
కరోనా ఎఫెక్ట్..మాస్క్ పెట్టుకుని పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ 

కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను కూడా వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహ్మమ్మారి  ప్రపంచాన్ని కబాడీ ఆడేసుకుంటోంది. దీని పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా ఎఫెక్ట్‌ భారత పార్లమెంట్‌కు పాకింది. చాలా మంది ఎంపీలు కరోనా ఎఫెక్ట్‌తో మాస్క్‌లతో పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు.

తాజాగా అమ్రావతి ఎంపీగా ఎన్నికైన టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ రాణా.. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలకు ముఖానికి మాస్క్ వేసుకొని సమావేశాలకు హాజరయ్యారు. ఈ కరోనా ప్రపంచంలోని దేశాల ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా వైరస్ దెబ్బతో చైనాతో పాటు భారత్ సహా అన్ని దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. దేశాలకు దేశాలే ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. 

కాగా..ఇరాన్ లో 23మంది ఎంపీలకు కరోనా వైరస్ సోకింది. మొత్తం 290 మంది ఎంపీల్లో 23 మందికి ఈ వ్యాధి సోకింది. ఇక ఆ దేశ ఉపాధ్యక్షురాలికి మసౌమె ఎబ్తేకర్‌ కూడా ఈ వ్యాధి సోకడం ఆందోళన కలిగించే అంశం. అలాగే ఉన్నతాధికారులకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆ దేశ అధ్యక్షుడు కూడా కరోనా బారిన పడ్డారనే వార్తలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ లో 77మంది కరోనాకి బలైపోయారు.