Delhi: ఆ నలుగురు ఉద్దేశపూర్వకంగానే యువతిని ఢీ కొట్టి 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు.. ఆ తర్వాత..: ఛార్జిషీట్‌లో పోలీసులు

Delhi: కారుతో ఢీ కొట్టిన ఆ యువకుల ముందు ఆ సమయంలో అంజలిని కాపాడేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని అయినప్పటికీ వారు ఆమెను కాపాడలేదని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

Delhi: ఆ నలుగురు ఉద్దేశపూర్వకంగానే యువతిని ఢీ కొట్టి 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు.. ఆ తర్వాత..: ఛార్జిషీట్‌లో పోలీసులు

Delhi Hit And Run Case

Delhi: ఢిల్లీలోని కంఝవాలాలో జనవరి 1న అంజలి అనే యువతిని కారుతో 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన కేసులో విచారణ జరుపుతున్న పోలీసులు తాజాగా నలుగురిపై హత్య కేసు నమోదుచేశారు. వారంతా ఉద్దేశపూర్వకంగానే ఆ అమ్మాయిని కారుతో ఈడ్చుకెళ్లారని పోలీసులు తేల్చారు. స్కూటీపై వెళ్తున్న అంజలి సింగ్ (20)ని ఢీ కొని ఈడ్చుకెళ్లడంతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే.

అంజలిని అమిత్ ఖన్నా, కృష్ణా, మనోజ్ మిఠల్, మిథున్ చంపేశారని నిన్న కోర్టుకు పోలీసులు తెలిపారు. కారుతో ఢీ కొట్టిన ఆ యువకుల ముందు ఆ సమయంలో అంజలిని కాపాడేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని అయినప్పటికీ వారు ఆమెను కాపాడలేదని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఆ యువతిని నలుగురు నిందితులు ఉద్దేశపూర్వకంగా కొన్ని కిలోమీటర్లు ఈడ్చెకెళ్లారని, ఆమె ఆ సమయంలో కారు ఇంజిన్ కింద ఇరుక్కుపోయి ఉందని చెప్పారు.

ఈ నేరాన్ని రెండు దశలుగా పేర్కొనవచ్చని, మొదట కారుతో అంజలి స్కూటీని ఢీ కొట్టారని, అనంతరం ఆమెను ఈడ్చుకెళ్లారని చార్జిషీట్‌లో పోలీసులు చెప్పారు. అంజలి స్కూటీని ఢీ కొట్టిన అనంతరం ఆమెను కొన్ని మీటర్లు ఈడ్చెకెళ్లి, కారును ఆపారని, ఆ యువతి కారు కింద ఉందా? లేదా? అని చూశారని చెప్పారు.

సీసీటీవీ కెమెరాలతో పాటు పలు సాక్ష్యాల ఆధారంగా కీలక విషయాలను గుర్తించామని తెలిపారు. ఆ సమయంలో నలుగురు నిందితులు కారులోనే ఉన్నట్లు తేల్చామన్నారు. అమిత్ ఖాన్న కారు నడుపుతున్నాడని, మనోజ్ మిట్టల్ ముందు సీట్లో కూర్చున్నాడని చెప్పారు. ఛార్జిషీట్‌లో ఆరుగురు సాక్ష్యుల పేర్లను పోలీసులు పేర్కొన్నారు.
India Britain Relations: రిషి సునక్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. కీలక అంశాలపై ప్రస్తావన