రచనలకు గుర్తింపు : కేంద్ర విద్యాశాఖా మంత్రికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

  • Published By: nagamani ,Published On : November 21, 2020 / 12:47 PM IST
రచనలకు గుర్తింపు : కేంద్ర విద్యాశాఖా మంత్రికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

Delhi : కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ వాతాయ‌న్‌ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోనున్నారు. గంగాన‌ది, హిమాల‌యాలు, ప‌ర్యావ‌ర‌ణంపై మంత్రి ర‌చ‌న‌ల‌కు లండ‌న్‌కు చెందిన వాతాయ‌న్ యూకే సంస్థ ఈ పుర‌స్కారాన్ని అందిస్తోంది. శనివారం (నవంబర్ 21,2020) లండ‌న్‌లో జ‌రుగనున్న కార్య‌క్ర‌మంలో ఆయ‌న అవార్డును అందుకుంటారు.



రచనల పట్ల ఎంతో మక్కువ చూపించే మంత్రి ఇప్ప‌టివ‌రకు 75కుపైగా పుస్త‌కాలు రాసిన మంత్రి అనేక అవార్డులు అందుకున్నారు. మాజీ ప్ర‌ధాని వాజపేయి నుంచి సాహిత్య భార‌తి అవార్డును, మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం నుంచి భార‌త్ గౌర‌వ్ స‌మ్మాన్, మారిష‌స్, ఉగాండా, నేపాల్‌, థాయ్‌లాండ్, భూటాన్ ప్ర‌భుత్వాల నుంచి సాహిత్య పుర‌స్కార‌ల‌ను అందుకున్నారు మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వాతాయన్.




https://10tv.in/google-facebook-and-twitter-threaten-to-leave-pakistan-over-new-rules/
పోఖ్రియాల్ నవలలు, కథలు,కవితలు రాశారు. హిందీలో 44 పుస్తకాలను రచించారు. వాటిలో కొన్ని ఇంగ్లీషు భాషలోకి కూడా అనువాదమయ్యాయి. భారతీయ భాషల్లోని పలు భాషల్లో కూడా అనువదించబడ్డాయి.