Delhi liquor Sacm: మనీశ్ సిసోడియా పాత్రపై ఈడీ 2,100 పేజీలతో అనుబంధ ఛార్జిషీట్

Delhi liquor Sacm: మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో సీబీఐ (CBI ) తమ అభిప్రాయం తెలిపింది.

Delhi liquor Sacm: మనీశ్ సిసోడియా పాత్రపై ఈడీ 2,100 పేజీలతో అనుబంధ ఛార్జిషీట్

Manish Sisodia

Delhi liquor Sacm: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇవాళ ఢిల్లీ రౌస్ అనెవ్యూ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ (chargesheet) దాఖలు చేసింది. అందులో మనీశ్ సిసోడియా ( Manish Sisodia ) పాత్ర వివరించింది. 271 ఆపరేటివ్ పేజీలు సహా మొత్తం 2,100 పేజీలతో ఈ ఛార్జిషీట్ ఉంది.

మరోవైపు, మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో సీబీఐ (CBI ) తమ అభిప్రాయం తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంను కేసులో నిజాలు తేలడానికి బెయిల్ ఇవ్వకూడదని చెప్పింది. బెయిల్ పిటిషన్ పై అభిప్రాయం తెలపాలని ఇటీవల సీబీఐకి హైకోర్టు చేసిన సూచన మేరకు ఆ సంస్థ ఇలా స్పందించింది.

అలాగే, మనీశ్ బెయిల్ పిటిషన్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అభిప్రాయం తెలపాలని ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశించింది. ఆ మేరకు జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ ఈడీకి నోటీసు ఇచ్చారు. తన భార్య ఆరోగ్యం బాగోలేదని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోరుతున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు మే 11కి వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ జరుగుతున్న కొద్దీ అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కామే జరగలేదని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. మనీశ్ సిసోడియాను ఈ కేసులో సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు.

Delhi liquor scam: ఛార్జిషీట్లో సంజయ్ సింగ్ పేరు పొరపాటుగా పడిందన్న ఈడీ.. లిక్కర్ స్కాం జరగలేదని రుజువైందన్న కేజ్రీవాల్