Sharath Chandra Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు

సౌత్ గ్రూప్ నుంచి శరత్ చంద్రారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఐదు నెలలుగా ఆయన తీహార్ జైలులోని ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నవంబర్ 10వ తేదీన శరత్ చంద్రారెడ్డి అరెస్టు అయ్యారు.

Sharath Chandra Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డికి ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన భార్యకు ట్రీట్ మెంట్ ఇప్పించేందుకు ఆరు వారాల బెయిల్ ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డి కోరగా.. కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి తీహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ నుంచి శరత్ చంద్రారెడ్డి కీలక పాత్రధారిగా ఉన్నారు.

సౌత్ గ్రూప్ నుంచి శరత్ చంద్రారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఐదు నెలలుగా ఆయన తీహార్ జైలులోని ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నవంబర్ 10వ తేదీన శరత్ చంద్రారెడ్డి అరెస్టు అయ్యారు. అయితే, తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు శరత్ చంద్రారెడ్డికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన భార్య ఆరోగ్యం సరిగ్గా లేదని, కొన్ని ముఖ్యమైన విషయాల్లో చికిత్స తీసుకోవాల్సివుందని ఆరు వారాలపాటు తనకు బెయిల్ ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డి కోర్టును కోరారు.

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం

కాగా, న్యాయస్థానం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మానవతా కోణంలో మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లుగా నాగ్ పాల్ ధర్మాసనం వెల్లడించింది. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి నానమ్మ చనిపోయినప్పుడు ఆమె అంత్యక్రియల కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అతనికి పది రోజులపాటు గతంలో బెయిల్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు తన భార్య అనారోగ్య కారణంగా ముఖ్యంగా వైద్య పరీక్షలకు సంబంధించిన అంశాలపై ఆయన ఉండాల్సిన అవసరముందని కోరిన నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.

ఏప్రిల్ రెండో వారంలోనే ముఖ్యంగా సప్లిమెంటరీ చార్జీషీట్ సైతం ఈడీ ఫైల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ మనీలాండరింగ్ స్కామ్ కేసులో 12 మందిని ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ సహా గౌతమ్ మల్హోత్రా, పలువురు ప్రముఖలతోపాటు లిక్కర్ వ్యాపారులను కూడా అరెస్టు చేశారు.

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీ పొడిగింపు

వారికి సంబంధించి చార్జీషీట్ ఫైల్ కావాల్సివుంది. ప్రస్తుతం సౌత్ గ్రూప్ నుంచి మనీలాండరింగ్ కేసులో ఇప్పటివరకు ఈడీ కేసులో బెయిల్ పొందినవారిలో కేవలం ఇది మధ్యంతర బెయిల్ మాత్రమే. నాలుగు వారాల తర్వాత తీహార్ జైలుకు శరత్ చంద్రారెడ్డి రావాల్సివుంటుంది. ఇది శరత్ చంద్రారెడ్డికి స్వల్ప ఊరటని చెప్పవచ్చు.

ట్రెండింగ్ వార్తలు