Delhi Covid Deaths: ఢిల్లీలో నెలల తర్వాత సున్నా కొవిడ్ మృతులు

Delhi Covid Deaths: ఢిల్లీలో నెలల తర్వాత సున్నా కొవిడ్ మృతులు

Delhi Covid Deaths Zero

Delhi Covid Deaths: దేశ రాజధానిలో కొన్ని నెలల తర్వాత కొవిడ్ మృతుల సంఖ్య ‘సున్నా’గా నమోదైంది. ఢిల్లీ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. 51 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా, కొవిడ్ మృతులు ఒక్కటి కూడా సంభవించకపోవడం విశేషం. చివరిసారిగా ఇలా సున్నా మృతులు నమోదైంది మార్చి2న మాత్రమే.

గడిచిన 24గంటల్లో.. పాజిటివిటీ రేట్ 0.07శాతం ఉంది. ఢిల్లీలో మొత్తం కేసులు 14లక్షల 35వేల 529 ఉండగా అందులోనే 592యాక్టివ్ కేసులు కూడా ఉన్నాయి. మొత్తం కొవిడ్ మృతులు 25వేల 27మంది.

రీసెంట్ గా 24గంటల్లో 80మంది రికవరీ అవగా.. 71వేల 546మంది కొవిడ్ టెస్టులు నిర్వహించారు. దీంతో 2కోట్లు 27లక్షల 96వేల 703మందికి టెస్టులు నిర్వహించినట్లు తేలింది. ఇదే కాకుండా కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తూ.. వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఇమ్యూనిటీ పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 13న, మార్చి 2న ఢిల్లీలో సున్నా కొవిడ్ మృతులు నమోదయ్యాయి. అదే కాకుండా జులై 12న నమోదైన కొవిడ్ కేసులు 45మాత్రమే. ఇది ఈ సంవత్సరంలోనే అత్యల్పం. వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు దేశ రాజధానిలో కన్వర్ యాత్రను పూర్తి రద్దు చేసి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎమ్ఏ).