వీరాభిమాని : 24 గంటలు మోదీజీ జపం… యూట్యూబ్‌లో లైవ్

  • Published By: nagamani ,Published On : September 18, 2020 / 01:22 PM IST
వీరాభిమాని : 24 గంటలు మోదీజీ జపం… యూట్యూబ్‌లో లైవ్

సెప్టెంబరు 17 ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం.దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మోడీకి 70వ పుట్టి సందర్భంగా పలే దేశాధినేతలతో పాటు సామాన్యులు సైతం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ మోడీ ధన్యవాదాలు తెలిపారు.




మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన వీరాభిమాని వినూత్నరీతిలో మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. అన్‌మోల్ బకాయా అనే ఈ యూట్యూబర్ తన ఛానల్‌లో ప్రధాని మోదీకి యూ ట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌లో శుభాకాంక్షలు తెలిపాడు.
https://10tv.in/actress-tattoos-secrets-is-this-the-meaning-check-it-out/
అలా ఒకటీ రెండూ గంటలు కాదు ‘మోడీ జీ’ మోడీ జీ’ అంటూ ఏకంగా 24 గంటల పాటు మోదీజీ పేరు జపిస్తూ శుభాభినందనలు తెలిపారు. ఈ లైవ్ జపం సందర్భంగా స్క్రీన్‌పై కౌంటింగ్ కూడా ప్రదర్శించారు. 24 గంటల్లో ఏకంగా 1,03,643 సార్లు ‘మోదీజీ’ పేరును ఉచ్ఛరించాడు.