Hair Transplant: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వికటించి వ్యక్తి మృతి.. కిడ్నీ, మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడమే కారణం

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ వికటించి ఒక వ్యక్తి మరణించాడు. ఢిల్లీ పరిధిలో ఈ ఘటన జరిగింది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వ్యక్తికి కిడ్నీతోపాటు మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి.

Hair Transplant: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వికటించి వ్యక్తి మృతి.. కిడ్నీ, మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడమే కారణం

Hair Transplant: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ వికటించి 30 ఏళ్ల వ్యక్తి మరణించిన ఘటన ఢిల్లీ పరిధిలో జరిగింది. అథర్ రషీద్ అనే 30 ఏళ్ల వ్యక్తికి బట్టతల ఉంది. దీంతో అతడు ఢిల్లీలోని ఒక క్లినిక్‌లో ఇటీవల హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. అయితే, ఆ తర్వాత నుంచి అతడికి అనేక అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి.

Delhi Tain: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. తప్పిన పెను ప్రమాదం

ట్రీట్‌మెంట్ తర్వాత నుంచి రషీద్ క్రమంగా అనారోగ్యానికి గురయ్యాడు. ముందుగా అతడి శరీరమంతా దద్దుర్లు మొదలయ్యాయి. తర్వాత కిడ్నీ ఫెయిల్ అయ్యింది. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిలయ్యాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రషీద్ మరణించాడు. రషీద్‌కు తల్లి, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ఆ కుటుంబానికి అతడే ఆధారం. రషీద్ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబానికి దిక్కులేకుండా పోయింది. దీంతో రషీద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రషీద్ ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని, అసలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ ఒక మోసమని రషీద్ తల్లి వ్యాఖ్యానించింది.

Pele: నేను బాగానే ఉన్నా.. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చిన పీలే

ఈ అంశంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఇద్దరు నిపుణులతోపాటు, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ వికటించి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. 2019లో ముంబైకు చెందిన ఒక వ్యాపారవేత్త ఇలాగే ప్రాణాలు పోగొట్టుకోగా, 2021 సెప్టెంబర్‌లో గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వల్లే మరణించాడు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.