విమానాశ్రయంలో సెక్యూరిటీని తప్పించుకోవడం కోసం ఏం చేశాడో తెలుసా!

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 01:55 AM IST
విమానాశ్రయంలో సెక్యూరిటీని తప్పించుకోవడం కోసం ఏం చేశాడో తెలుసా!

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకింగ్స్‌ ‘క్యూ’ ను తప్పించుకోవడం కోసం ఓ వ్యక్తి డైరెక్ట్ గా పైలెట్ యూనిఫాం వేసుకుని వచ్చాడు. కానీ అక్కడున్న CISF కు అడ్డంగా బుక్ అయ్యాడు, వెంటనే అతన్ని అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

ఢిల్లీకి చెందిన రాజన్ మెహబూబాని(48) అనే వ్యక్తి ఎయిర్ ఏషియా విమానంలో కోల్‌కతా వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చాడు. అయితే అక్కడి సెక్యూరిటీ చెకింగ్స్‌ను తప్పించుకోడానికి పైలెట్‌ గా యూనిఫాం చేసుకున్నాడు. అయితే విమానం బయలుదేరే గేట్ దాటుతుండగా CISF సిబ్బంది అరెస్ట్ చేసింది.  

ఢిల్లీ పోలీసులు నిందితుడిని దర్యప్తు చేయగా.. విమానయానంలో యూట్యూబ్ వీడియోలను తీసేవాడినని, బ్యాంకాక్లో లుఫ్తాన్స నకిలీ ఐడి కార్డును పొందానని ప్రయాణీకుడు చెప్పాడు. అంతేకాదు అతని ఫోన్లో.. అతను ఆర్మి కల్నల్ గా నటిస్తున్న ఫోటోస్ కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.