MCD Mayoral Elections: నేడే ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేతను నియమించిన ఎల్జీ.. మండిపడ్డ ఆప్

గత డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా, 7న ఫలితాలు వెలువడ్డాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ తరఫున షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్ పోటీ పడుతున్నారు.

MCD Mayoral Elections: నేడే ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేతను నియమించిన ఎల్జీ.. మండిపడ్డ ఆప్

MCD Mayoral Elections: ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక నేడు (శుక్రవారం) జరగనుంది. మేయర్ ఎన్నిక కోసం మున్సిపాలిటీ తాత్కాలిక స్పీకర్‌గా బీజేపీ నేత సత్య శర్మను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించారు. సత్య శర్మ ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచాడు.

AP High Court : సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సత్య శర్మ ఆధ్వర్యంలో నేడు మేయర్ ఎన్నిక జరుగుతుంది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయం. అయితే, సత్య శర్మను ప్రొటెం స్పీకర్ లేదా ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తూ ఢిల్లీ ఎల్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఆప్ వ్యతిరేకిస్తోంది. ఎల్జీ వీకే సక్సేనా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తోంది. అలాగే బీజేపీపై కూడా విమర్శలు చేస్తోంది. ప్రజాస్వామ్య సంప్రదాయాల్ని, వ్యవస్థల్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందని మండిపడింది. సంప్రదాయం ప్రకారం సీనియర్ కౌన్సిలర్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని, కానీ, వీకే సక్సేనా తనకు కావాల్సిన బీజేపీ నేతను నియమించారని ఆప్ విమర్శించింది.

Russia Temporary Ceasefire : యుక్రెయిన్ తో యుద్ధంపై పుతిన్ కీలక ప్రకటన.. తాత్కాలిక కాల్పుల విమరణ

గత డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా, 7న ఫలితాలు వెలువడ్డాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ తరఫున షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరో ఒకరిని ఆప్ ఎంపిక చేస్తుంది. బీజేపీ తరఫున రేఖా గుప్తా మేయర్ పదవికి పోటీ పడనుంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆప్ తరఫున మొహమ్మద్ ఇక్బాల్, జలాజ్ కుమార్ బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున కమల్ బాగ్రి పోటీ పడుతున్నారు.

ఢిల్లీ మేయర్ పదవి ఐదేళ్లూ రొటేషన్ పద్ధతిలో ఉంటుంది. మొదటి సంవత్సరం మహిళ, రెండో ఏడాది ఓపెన్ కేటగిరి, మూడో సంవత్సరం రిజర్వ్‌డ్ కేటగిరి, నాలుగు, ఐదు సంవత్సరాల్లో ఓపెన్ కేటగిరి వ్యక్తులు ఎన్నికవుతారు.