Delhi Mayor Poll: మూడోసారి వాయిదాపడ్డ ఢిల్లీ మేయర్ ఎన్నిక.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఆప్

నెల రోజుల వ్యవధిలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడటం ఇది మూడోసారి. నామినేటెడ్ సభ్యుల విషయంలో ఆప్, బీజేపీ మధ్య తలెత్తిన వివాదం కారణంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాపడుతూ వస్తోంది. ఉదయం 11.30 గంటలకు డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ప్రారంభమైంది.

Delhi Mayor Poll: ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. సోమవారం మూడోసారి జరిగిన ఢిల్లీ మున్సిపల్ సమావేశం కూడా మేయర్ ఎన్నిక పూర్తికాకుండానే ముగిసింది. తిరిగి మరోసారి ఎన్నిక నిర్వహించే తేదీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటిస్తారు.

Telangana Budget 2023: ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ .. బడ్జెట్‌లో రూ. 7,890 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

నెల రోజుల వ్యవధిలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడటం ఇది మూడోసారి. నామినేటెడ్ సభ్యుల విషయంలో ఆప్, బీజేపీ మధ్య తలెత్తిన వివాదం కారణంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాపడుతూ వస్తోంది. ఉదయం 11.30 గంటలకు డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ప్రారంభమైంది. మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ ఎన్నిక వరుసగా జరుగుతుందని ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేస్తారని సత్య శర్మ ప్రకటించారు. దీనిపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సత్యశర్మ నిర్ణయంపై ఆప్ నిరసన వ్యక్తం చేసింది. ఇది బీజేపీ, ఆప్ మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.

Telangana Budget 2023-24 : రైతన్నలకు శుభవార్త..రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు,రైతుబంధుకు రూ. 1575 కోట్లు..

ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికను వాయిదావేస్తూ ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ ఎన్నిక వరుసగా వాయిదాపడుతుండటంపై ఆప్ నిరాశవ్యక్తం చేస్తోంది. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆప్ నిర్ణయించింది. సోమవారం సాయంత్రం ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఆప్ పిటిషిన్ దాఖలు చేయనుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ) ఫలితాలు డిసెంబర్‌లో వెలువడ్డాయి. 250 స్థానాలున్న డీఎంసీలో ఆప్ 134 స్థానాలు దక్కించుకుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు