No Liquor Sale : మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. మూడు రోజులు లిక్కర్ బంద్

మందు బాబులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపించాయి.

No Liquor Sale : మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. మూడు రోజులు లిక్కర్ బంద్

No Liquor Sale : మందు బాబులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. అయితే, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. దేశ రాజధాని ఢిల్లీలో. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపించాయి. ఈ క్రమంలో ఢిల్లీలో మూడు రోజుల పాటు డ్రై డే అమలు కానుంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఆల్కహాల్‌ను బ్యాన్ చేసింది ప్రభుత్వం. బార్లు, క్లబ్ లు, షాపులు, ఇతర చోట్లలోనూ మద్యం అమ్మకాలపై ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేసిన రోజును డ్రై డే అంటారు.

Also Read : PM Modi: అందుకే కాంగ్రెస్ పాలనలో పేదరికం పెరిగిపోయింది: ప్రధాని మోదీ

రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మూడు రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్ కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, సేల్ ఔట్ లెట్స్ మూతపడనున్నాయి.

Also Read.. Gujarat Elections 2022: నేడు గుజరాత్‌లో మొదటి విడత పోలింగ్.. 89 అసెంబ్లీ స్థానాల్లో 788 మంది పోటీ

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అనధికారికంగా ఎవరూ లిక్కర్ ను నిల్వ చేయడం కానీ, తరలించడం కానీ చేయకుండా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డిసెంబర్ 7న కౌంటింగ్ జరగనుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరుగా చూస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రాధాన్యత పెరిగింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.