ఢిల్లీ మెట్రో స్టేషన్ లో డ్యూటీ చేయనున్న లాడెన్‌ను వేటాడిన బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్క

  • Published By: madhu ,Published On : September 3, 2020 / 09:51 AM IST
ఢిల్లీ మెట్రో స్టేషన్ లో డ్యూటీ చేయనున్న లాడెన్‌ను వేటాడిన బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్క

ఢిల్లీ మెట్రో స్టేషన్ లో బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కుక్క డ్యూటీ చేయనుంది. ఢిల్లీ పరిధిలోని కీలక మెట్రో స్టేషన్లలలో ఇది కనిపించనున్నది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ప్రస్తుతం ఒక్కో రంగానికి వెసులుబాటు కల్పిస్తూ…నిర్ణయాలు తీసుకొంటోంది. అన్ లాక్ 4.0లో భాగంగా…మెట్రో సర్వీసులకు పచ్చ జెండా ఊపింది.



సెప్టెంబరు 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైళ్లు నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. భద్రతా కారణాల రీత్యా…ఢిల్లీ మెట్రోలో బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కుక్క ‘పోలో’ను కేటాయించారు. స్థానిక స్టేషన్లలో భదత్రా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కలిసి విధులు నిర్వహించనుంది.
https://10tv.in/cdc-defends-controversial-new-guidance-for-coronavirus-testing/
అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టడంలో ఈ జాతికి చెందిన శునకం ‘కైరో’ ప్రముఖ పాత్ర పోషించింది. అప్పటి నుంచి బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వాసన పసిగట్టడం, దాడి చేయడం, కాపలాకాయడం వంటి మూడు విధులు నిర్వహించడం దీని ప్రత్యేకత. అంతేకాదు..ఇది ఏకధాటిగా 40 కిలోమీటర్లు పరిగెత్తగలదు.
మెట్రో సర్వీసుల ప్రారంభానికి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.



ప్రయాణికులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రతి ఒక్కరికీ థర్మల్​ స్క్రీనింగ్ నిర్వహించాలి. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే బోర్డింగ్​కు అనుమతి. ప్రయాణికులు ఉపయోగం కోసం స్టేషన్‌ ఎంట్రీ వద్ద శానిటైజర్. ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరి.

మరోవైపు..దేశ రాజధానిలో మూడు దశల్లో, నిర్దిష్ట సమయాల్లో మెట్రో రైల్ సేవలను పునరుద్ధరించనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ప్రకటించింది. మొదటి దశలో భాగంగా ఈ నెల 7న పసుపు మార్గాలైన సమైపూర్ బద్లి నుండి హుడా సిటీ సెంటర్ వరకు,రెండో దశలో భాగంగా ఈ నెల 9న నీలం, గులాబీ మార్గాలతోపాటు గుర్గావ్ లేన్‌లో, వరగా మూడో దశలో భాగంగా ఈ నెల 10న రెడ్ లైన్‌లోని ఘజియాబాద్ నుండి రితాలా, బహదూర్‌గఢ్, ఫరీదాబాద్ మార్గాలలో మెట్రో రైలు సేవలు ప్రారంభమవుతాయని డీఎంఆర్సీ చీఫ్ మంగు సింగ్ తెలిపారు.



మెట్రో రైల్ స్టేషన్ల‌లోకి ప్రయాణికుల ప్రవేశం కోసం నిర్దేశించిన గేట్లు మాత్రమే తెరుస్తారని అన్నారు. బయటకు వెళ్లేవారి కోసం వేరే గేటు ఉంటుందన్నారు. మెట్రో రైలు టికెట్ల కొనుగోలుకు స్మార్ట్ కార్డులు, నగదు రహిత ఆన్‌లైన్ చెల్లింపులను అనుమతిస్తామని తెలిపారు.