తెరుచుకోని మెట్రో డోర్…ప్రయాణికుల అవస్థలు

  • Published By: venkaiahnaidu ,Published On : September 24, 2019 / 11:15 AM IST
తెరుచుకోని మెట్రో డోర్…ప్రయాణికుల అవస్థలు

దేశరాజధాని ఢిల్లీ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.ఫ్లాట్ ఫాంపై మెట్రో రైలు ఆగినప్పటికీ ప్రయాణికులు కిందకి దిగలేకపోయారు. ఉదయం ఈ ఘటన జరిగింది.

ద్వారక వెళుతున్నబ్లూలైన్ మార్గంలో ప్రయాణిస్తున్న మెట్రో రైలు స్టేషన్ కు చేరుకోగానే అందులోని ఒక గేట్ తెరుచుకోలేదు. దీంతో బయటికి రావడానికి నిలబడిన ప్రయాణికులకి ఏమీ అర్థం కాలేదు. కొంత సమయంలో తలుపు తెరుకోవచ్చని వారు భావించారు, కానీ అది జరగలేదు.

మిగిలిన గేట్లు తిరిగి మూసివేయబడి రైలు బయలుదేరింది. తరువాత ఆ డోర్‌ను వినియోగించవద్దని మెట్రో అధికారులు ప్రయాణికులకు సూచించారు. ఈ డోరు పనిచేయడం లేదు‘ అని రాసివున్న స్టిక్కర్ అక్కడ అతికించారు. దీంతో ప్రయాణికులు తర్వాతి స్టేషన్ లో దిగితిరిగి రావలసి వచ్చింది.