Delhi MLAs: ఢిల్లీ ఎమ్మెల్యేలకు 66 శాతం పెరిగిన జీతాలు.. నెలకు ఎంతొస్తుందో తెలుసా..

ఎమ్మెల్యేలకు 66 శాతం జీతాలు పెంచుతూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎమ్మెల్యేల వేతనాలు, ఇతర అలవెన్స్‌లు భారీగా పెరగనున్నాయి. వేతనాల పెంపు ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నిర్ణయంపై ఆమోదం తెలిపితే ఇది అమల్లోకి వస్తుంది.

Delhi MLAs: ఢిల్లీ ఎమ్మెల్యేలకు 66 శాతం పెరిగిన జీతాలు.. నెలకు ఎంతొస్తుందో తెలుసా..

Delhi MLAs: అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంచింది. ఎమ్మెల్యేలకు 66 శాతం జీతాలు పెంచుతూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎమ్మెల్యేల వేతనాలు, ఇతర అలవెన్స్‌లు భారీగా పెరగనున్నాయి. వేతనాల పెంపు ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదానికి పంపింది.

UPI Payment Limit: యూపీఐ పేమెంట్లపై పరిమితి.. ఏ బ్యాంకు డైలీ లిమిట్ ఎంతంటే..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నిర్ణయంపై ఆమోదం తెలిపితే ఇది అమల్లోకి వస్తుంది. తాజా నోటిఫికేషన్ అమలైతే ఢిల్లీ ఎమ్మెల్యేలు నెలకు సగటున రూ.90,000 వేతనం అందుకుంటారు. ప్రస్తుతం వీరి వేతనం రూ.54,000గా ఉంది. ఎమ్మెల్యేల నెలవారీ బేసిక్ శాలరీ రూ.12,000 నుంచి రూ.30,000కు పెరగనుంది. అలాగే నియోజకవర్గ అలవెన్స్ రూ.18,000 నుంచి రూ.25,000కు, కన్వేయెన్స్ అలవెన్స్ రూ.6,000 నుంచి రూ.10,000కు, టెలిఫోన్ అలవెన్స్ రూ.8,000 నుంచి రూ.10,000కు, సెక్రటేరియెట్ అలవెన్స్ రూ.10,000 నుంచి రూ.15,000కు పెరగనుంది. దీంతో ఎమ్మెల్యేలకు మొత్తంగా నెలకు రూ.90,000 అందుతాయి.

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 16న ఫలితాలు వెల్లడి

ఎమ్మెల్యేలతోపాటు మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నేత, చీఫ్ విప్‌ల వేతనాలు కూడా భారీగా పెరగబోతున్నాయి. ప్రస్తుతం వీరి వేతనాలు సగటున నెలకు రూ.72,000గా ఉండగా, ఇకపై రూ.1.70 లక్షలకు పెరుగుతుంది. వీరి బేసిక్ శాలరీ రూ.20,000 నుంచి రూ.60,000కు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇతర అలవెన్సుల్ని కూడా భారీగానే పెంచారు. వీటితోపాటు ఫ్యామిలీ ట్రావెల్ అలవెన్స్, అకామడేషన్ ఫీ, కార్ డ్రైవర్ కన్వేయెన్స్, మెడికల్ ట్రీట్‌మెంట్ ఛార్జీలు కూడా భారీగా పెరగబోతున్నాయి. గత జూలైలోనే వేతనాలు పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ బిల్లు ఆమోదించింది. అంతకుముందు దేశంలోనే అతి తక్కువ వేతనాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలుగా ఢిల్లీ ఎమ్మెల్యేలు నిలిచారు. అయితే, ఇప్పుడు వీళ్లు కూడా భారీ వేతనాలే అందుకోబోతున్నారు.