Delhi Bulldozrr politics: ఢిల్లీ మున్సిపాలిటీకి ఎన్నికల్లోనూ బుల్డోజర్ రాజకీయాలు..?!మాట వినకుంటే తొక్కి చంపేస్తారా..? | Delhi Municipal Election in Bulldozrr politics

Delhi Bulldozrr politics: ఢిల్లీ మున్సిపాలిటీకి ఎన్నికల్లోనూ బుల్డోజర్ రాజకీయాలు..?!మాట వినకుంటే తొక్కి చంపేస్తారా..?

బుల్డోజర్ పాలిటిక్స్‌ ఢిల్లీకి కొత్తమో కానీ యూపీ, గుజరాత్‌కి కాదు.ఈ పిచ్చి రాజకీయాలు ఢిల్లీకి కూడా పాకాయి. మాట వినకున్నా,ఎదురు తిరిగినా బుల్డోజర్‌లను రంగంలోకి దింపేస్తున్నారు.

Delhi Bulldozrr politics: ఢిల్లీ మున్సిపాలిటీకి ఎన్నికల్లోనూ బుల్డోజర్ రాజకీయాలు..?!మాట వినకుంటే తొక్కి చంపేస్తారా..?

Delhi Municipal Election in Bulldozrr politics: బుల్డోజర్ పాలిటిక్స్‌ ఢిల్లీకి కొత్తమో కానీ యూపీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌కి కాదు ! ఇంకా చాలా రాష్ట్రాల్లోనే ఈ తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ పిచ్చి రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీకి కూడా పాకాయి. తమ మాట వినకున్నా, తమకు ఎదురు తిరిగినా బుల్డోజర్‌లను రంగంలోకి దింపేస్తున్నారు. ప్రత్యర్థి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈ రాజకీయాలకు పేద ప్రజలను కూడా బలి చేయడమే ఆందోళనకు కారణమవుతోంది. అసలు ఈ బుల్డోజర్ పాలిటిక్స్‌ లక్ష్యం ఏంటి ? మాట వినకుంటే తొక్కి చంపేస్తారా ? ఈ నేతలు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ?

ఈ బుల్డోజర్ రాజకీయాలు పురుడు పోసుకుంది ఉత్తరప్రదేశ్‌లోనే! అక్కడి నుంచి చాపకింద నీరులా ఈ రాజకీయాలు దేశమంతా పాకుతున్నాయి. రోజురోజుకు ఈ సంస్కృతి శృతి మించిపోతోంది. హద్దులుమీరి పోతోంది. ఇప్పుడు ఢిల్లీలో బుల్డోజర్‌ విధ్వంసం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. పైకి హనుమాన్ శోభాయాత్రకు సందర్భంగా జరిగిన అల్లర్లకు.. ఇది రియాక్షన్ అని చెబుతున్నా అసలు రీజన్ వేరే ఉన్నట్లు కనిపిస్తోంది. త్వరలో ఢిల్లీ మున్సిపాలిటీకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బుల్డోజర్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. రాజకీయాలకు సామాన్యులు ఎలా బలవుతున్నారో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరం లేదు.

Also read : Bulldozrr politics : దేశాన్ని భయపెడుతున్న బుల్డోజర్ రాజకీయాలు..యూపీలో మొదలై హస్తినకు అరాచకాలు

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బుల్డోజర్ అన్న పదం ఎక్కువగా వినిపించింది. రాష్ట్రంలో నేరాలకు పాల్పడే వారికి వ్యతిరేకంగా యోగి ప్రభుత్వం కఠినమైన వైఖరికి పర్యాయపదంగా దీన్ని వాడారు. ఈ దెబ్బకు ఆ రాష్ట్రంలో పరారీలో ఉన్న నేరస్తులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. కానీ ఆ తర్వాత దీనికి పూర్తిగా అర్థం మార్చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో విపక్ష నేతలు, ఒక వర్గం ప్రజల ఆస్తులు, ఇండ్ల కూల్చివేతను మొదలు పెట్టారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారనే కారణంతో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి షాజిల్‌ ఇస్లాంకు చెందిన పెట్రోల్‌ బంక్‌ను లక్ష్యంగా చేసుకొని బుల్డోజర్‌తో తొక్కి పారేశారు.ఆఖరికి పరిస్థితి ఎంత దారుణంగా తయ్యారవుతోంది అంటే తిరుగులేని అధికారానికి, దీనులపై దుర్మార్గ బలప్రయోగానికి బుల్డోజర్ భయపెట్టే గుర్తుగా మారుతోంది. యుపిలో లాగా చేయాలి, బుల్‌డోజర్లతో తొక్కేయాలి, న్యాయం అంటే ఇలానే ఉండాలి, శిక్ష అంటే అలాగే పడాలి.. అన్నంతలా ఈ పిచ్చి మిగతా రాష్ట్రాలకు పాకుతోంది. ఇదే ఆందోళనకు కారణం అవుతోంది.

Also read : MLA Raja Singh : బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

మధ్యప్రదేశ్‌లోనూ ఇప్పుడు బుల్డోజర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్లు రువ్విన ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న వారి ఇండ్లను అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. ఈ అనుమానితులంతా ఒకే వర్గానికి చెందినవారు ! పెద్ద పెద్ద బుల్‌డోజర్లు ఇళ్లను నేలమట్టం చేస్తుంటే.. అక్కడి కుటుంబాలు నిస్సహాయంగా ఏడుస్తూ నిలబడడం తప్ప మరేమీ చేయలేకపోయాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వరదలా పోటెత్తాయి. ఒక వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వమే స్వయంగా విధ్వంసానికి దిగటం ఈ దారుణానికి పరాకాష్ఠ. రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో.. అక్కడి ఇండ్లు కూలపోవడం ఖాయమంటూ మధ్యప్రదేశ్‌ న్యాయ, హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా వ్యాఖ్యానించడం కంటే దారుణం ఇంకేం ఉంటుంది. పాలకుల నీతి ఏ రీతిన ఉందో చెప్పడానికి ఇదే బెస్ట్‌ ఎగ్జాంపుల్ ! గుజరాత్‌లోనూ ఈ తరహా రాజకీయాలకు నడుస్తున్నాయి. గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో కూడా శ్రీరామనవమి సందర్భంగా ఇదేవిధమైన దాడులు జరిగాయి. అక్రమ నిర్మాణాల పేరుతో ఒక వర్గం వారి ఇండ్లను, ఆస్తులను బుల్డోజర్లతో కూల్చేశారు.

తెలంగాణాకు ఈ బుల్డోజర్ పైత్యం పాకేటట్లు కనిపిస్తోంది. బీజేపీ నేతల చేసిన బుల్డోజర్ కామెంట్స్‌ కాక పుట్టించాయి. ఆ బుల్డోజర్లు తెలంగాణకు వస్తాయని.. ఓటేయకపోతే తొక్కించేస్తామంటూ చేసిన కామెంట్స్‌ ప్రకంపనలు సృష్టించాయి. ఇప్పుడు దేశంలో పరిస్థితి చూస్తుంటే.. మీరు మమ్మల్ని ఏ రకంగా ప్రశ్నించినా, సవాల్ చేసినా.. మేం మీమీదకు వస్తాం. మీ ఇళ్లు, మీ జీవనాధారాలు ధ్వంసం చేస్తాం. మిమ్మల్ని నేలమట్టం చేస్తాం.. అంటూ వార్నింగ్‌ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.. ఈ ఘటనలు ! ఈ చర్యను అనుమతిలేని కట్టడాల ప్రాతిపదికన సమర్థించుకుంటున్నారు. దోషులను ఒక్కొక్కరిగా గుర్తించటం అనేది చాలా సమయం పట్టే ప్రక్రియ..కాబట్టి అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నిటినీ పరిశీలించాం. అల్లర్లకు పాల్పడేవారికి గుణపాఠం చెప్పటానికి అక్రమ నిర్మాణాలను కూల్చేశామంటూ తాము గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇంతకంటే నీచం ఇంకేం ఉంటుంది.

Also read : UP : యూపీ పెళ్లి వేడుక‌ల్లో గిఫ్ట్‌లుగా బుల్డోజ‌ర్లు..ఇవి మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు,యూపీ అభివృద్ధికి గుర్తు అంటున్న మేయర్

పన్నుకు పన్ను, కన్నుకు కన్ను అన్నట్లుగా వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. దమ్ముంటే తప్పు చేసిన నేరస్తుల్ని పట్టుకుని ఆ నేరాన్ని న్యాయస్థానాల్లో రుజువు చేసి వారిని తగిన విధంగా శిక్షించాలి. ఇంకా దమ్ముంటే అసలు దాడులు జరగకుండానే నిరోధించగలగాలి. అంతేకానీ తక్షణ న్యాయం పేరుతో ప్రతీకార చర్యలకు పాల్పడితే ఎలా ? అరెస్టుల దగ్గరే ఆగకుండా వారి ఆస్తులు, నివాసాలు లక్ష్యాలుగా చేసుకోవడం దారుణం కాదా ? బుల్‌డోజర్లతో ఇళ్లు, దుకాణాలను తొక్కించేసిన తర్వాత అతడు నిర్దోషి అని తేలితే అప్పుడేం సమాధానం చెబుతారు..
ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి అరాచకాలు చెల్లనేచెల్లవు. మనకంటూ మనం తయారు చేసుకున్న ఓ చట్టం ఉంది.. దాన్ని అమలు చేయడానికి ఓ యంత్రాగం ఉంది.. దాని ప్రకారమే పాలన సాగాలే తప్ప.. ఇష్టమున్నట్లు చేస్తానంటే.. అలాంటి పార్టీలకు ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్పాల్సి వస్తుంది.

 

 

×