PFI Raids: 19మంది పీఎఫ్‌ఐ సభ్యుల కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించిన ఢిల్లీ ఎన్ఐ‌ఏ కోర్టు

మహారాష్ట్రలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) పై గతవారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. ఇందులో ఇండియన్ ఇస్లామిస్ట్ రాజకీయ సంస్థతో సంబంధం ఉన్నందుకు 106 మందిని అరెస్టు చేశారు.

PFI Raids: 19మంది పీఎఫ్‌ఐ సభ్యుల కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించిన ఢిల్లీ ఎన్ఐ‌ఏ కోర్టు

Delhi NIA court

PFI Raids: మహారాష్ట్రలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) పై గతవారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. ఇందులో ఇండియన్ ఇస్లామిస్ట్ రాజకీయ సంస్థతో సంబంధం ఉన్నందుకు 106 మందిని అరెస్టు చేశారు. ఢిల్లీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోమవారం అరెస్టు చేసిన పంతొమ్మిది మందికి మరో ఐదు రోజుల రిమాండ్ పొడిగించింది. నాలుగు రోజుల రిమాండ్ ముగియడంతో వారిని కోర్టు ముందు హాజరుపరిచారు.

YouTube Channels: ఆ 45 వీడియోలను బ్లాక్ చేయండి .. యూట్యూబ్‌ను కోరిన కేంద్రం.. ఎందుకంటే?

15 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులపై ఎన్ఐఏ నిర్వహించిన దాడులకు “ఆపరేషన్ ఆక్టోపస్” అనే కోడ్ పేరు ఉంది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంయుక్త బృందాలు సెప్టెంబర్ 22న పలు రాష్ట్రాలలో పలుచోట్ల జరిపిన పలు దాడుల్లో 106 మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేశాయి.

Android: మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? అయితే వెంటనే ఈ యాప్స్ తీసేయండి

ఢిల్లీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హైదరాబాద్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్, మణిపూర్లలో పీఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు ఉగ్రవాదం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, సాయుధ శిక్షణ అందించేందుకు శిక్షణా శిబిరాలు నిర్వహించడం, నిషేధిత సంస్థల్లో చేరేలా వ్యక్తులను సమూలంగా మార్చడం వంటి అంశాల్లో ఎన్‌ఐఏ నమోదు చేసిన ఐదు కేసులకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి.