Delhi civic polls: నేఢే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. 250 స్థానాలకు పోటీ.. పింక్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు

దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. మొత్తం 250 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి.

Delhi civic polls: నేఢే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. 250 స్థానాలకు పోటీ.. పింక్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు

Delhi civic polls: దేశ రాజధాని ఢిల్లీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆదివారం జరగబోతున్నాయి. మున్సిపల్ కొర్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) పరిధిలోని 250 స్థానాలకు ఈ రోజు ఎన్నిక జరుగుతుంది. ఢిల్లీ పరిధిలో కార్పొరేషన్ల పునర్విభజన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే.

Pawan Kalyan: రాజకీయ జీవితంలో ఓడిపోయాను: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

ఈ ఏడాది మేలో కార్పొరేషన్లను పునర్విభజించి, కొన్నింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 1,349 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఫలితాలు ఈ నెల 7న వెలువడుతాయి. ఈసారి పోటీ త్రిముఖంగా ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఇక్కడ 2007 నుంచి బీజేపీ అధికారంలో ఉంది. అయితే, ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 1.45 కోట్ల మంది ఓటు వేయబోతున్నారు. వీరిలో 78.39 లక్షల మంది పురుషులు ఉన్నారు. వందేళ్లు దాటిన ఓటర్లు 229 మంది, 80-100 ఏళ్ల వయసు కలిగిన ఓటర్లు 2.04 లక్షల మంది ఉన్నారు. 95,458 మంది తొలిసారిగా ఓటు వేయబోతున్నారు. ఈ ఎన్నికల కోసం అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు.

దీనికోసం 56,000 ఈవీఎంలను సిద్ధం చేశారు. 13,638 పోలింగ్ స్టేషన్లలో ఎన్నిక జరుగుతుంది. 68 మోడల్ పోలింగ్ స్టేషన్లతోపాటు, మహిళల కోసమే ప్రత్యేకంగా పింక్ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. పింక్ పోలింగ్ స్టేషన్లలో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారు. అక్కడ తల్లులు ఫీడింగ్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లొచ్చు. వారికోసం ఊయలలు, సెల్ఫీ బూత్ వంటివి కూడా ఏర్పాటు చేశారు. మోడల్ పోలింగ్ స్టేషన్లలో అన్ని వసతులు ఉంటాయి. వెయిటింగ్ ఏరియా, లాంజెస్, సెల్ఫీ బూత్, ప్రత్యేక సహాయకులు ఉంటారు.