ఆ కారును చూసి షాక్ అయిన పోలీసులు..ఎక్కడ చూసినా తుపాకులే

ఆ కారును చూసి షాక్ అయిన పోలీసులు..ఎక్కడ చూసినా తుపాకులే

దేశ రాజధాని పోలీసులకు ఓ ఘటన షాక్ తెప్పించింది. అక్రమ ఆయుధాల రవాణా చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఓ వ్యక్తిని ఆపి అతడి కారులో సోదాలు చేపట్టగా..భారీ సంఖ్యలో తుపాకులు బయటకు రావడంతో షాక్ తిన్నారు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా..35 పిస్టళ్లు, భారీ మందుగుండు సామాగ్రీ బయటపడడంతో ఆశ్చర్యపోయారు పోలీసులు.

వివరాల్లోకి వెళితే…
ఢిల్లీలో అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆశిష్‌ అనే వ్యక్తి ఆయుధాలను అమ్ముతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతడిపై నిఘా పెంచారు. పోలీసుల కళ్లు గప్పి గన్స్‌ను తరలిస్తున్న ఆశిష్‌ ఢిల్లీలో అడ్డంగా దొరికిపోయాడు. అయితే అతను తుపాకులు దాచిన ప్లేస్‌ చూసి పోలీసులు ఖంగుతిన్నారు. కారులోని ప్రతి పార్ట్‌లో గన్స్‌ను దాచిపెట్టాడు ఆశిష్‌. ఏకంగా 35 తుపాకులను కారులోని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచాడు. కారులోని ఏ భాగాన్ని వెతికినా అందులో నుంచి గన్స్‌ బయటకు వస్తుండడంతో పోలీసులు షాకయ్యారు. దీంతో కారు మొత్తం జల్లెడ పట్టారు. ఓవరాల్‌గా 35 పిస్టళ్లతో పాటు భారీ మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భూమి తవ్వే కొద్దీ నీళ్లు వచ్చినట్లు.. ఆశిష్‌ కారును వెతికే కొద్దీ గన్స్‌ వచ్చాయి.

అక్రమ ఆయుధాల రవాణాపై ఢిల్లీ పోలీసులకు వారం రోజులుగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు పక్కా ప్లాన్ వేసుకున్నారు. నగరంలో అక్రమంగా ఆయుధాలు అమ్ముతున్న అనుమానితుల లిస్ట్‌ తయారు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల దృష్టిలో ఆశిష్‌ పడ్డాడు. అతనిపై పోలీసులకు ముందునుంచే చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే ప్రతిసారి తెలివితేటలతో ఆశిష్‌ తప్పించుకునేవాడు. ఈసారి మాత్రం పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.