Nupur Sharma: నుపుర్ శర్మను బెదిరించిన భీమ్ సేన్ చీఫ్ అరెస్ట్ | Delhi Police arrests Bhim Sena chief for threatening Nupur Sharma

Nupur Sharma: నుపుర్ శర్మను బెదిరించిన భీమ్ సేన్ చీఫ్ అరెస్ట్

బీజేపీ నేత నుపుర్ వర్మపై బెదిరింపులకు దిగిన భీమ్ సేన చీఫ్ నవాబ్ సత్పల్ తన్వార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హింస జరగకుండా ముందస్తుగా అడ్డుకునేందుకే ఇలా జరిపామని కామెంట్ చేశారు. గురువారం అతని ఇంటి నుంచే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు.

Nupur Sharma: నుపుర్ శర్మను బెదిరించిన భీమ్ సేన్ చీఫ్ అరెస్ట్

 

 

Nupur Sharma: బీజేపీ నేత నుపుర్ వర్మపై బెదిరింపులకు దిగిన భీమ్ సేన చీఫ్ నవాబ్ సత్పల్ తన్వార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హింస జరగకుండా ముందస్తుగా అడ్డుకునేందుకే ఇలా జరిపామని కామెంట్ చేశారు. గురువారం అతని ఇంటి నుంచే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు.

ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం, క్రిమినల్ చర్యలకు పాల్పడతానని బెదిరించడం, కొన్ని గ్రూపులను హింసకు ప్రేరేపించడం వంటి కేసులు నమోదయ్యాయి. తన్వార్ ఆయన ఫేస్ బుక్ అకౌంట్లో నుపుర్ శర్మపై దాడి చేసిన వారికి రూ.1కోటి ఇస్తానంటూ చేసిన ప్రకటనతో బెదిరింపులకు దిగారు.

ఒక సీనియర్ పోలీసాఫీసర్ మాట్లాడుతూ.. “వీడియోను సాక్ష్యంగా తీసుకున్నాం. ద్వేషపూరితంగా రెచ్చగొడుతూ బెదిరింపులకు దిగుతున్నాడని తెలిసింది. గుర్ గావ్ లో ఉన్న అతడి ఇంట్లో నుంచి అరెస్ట్ చేశాం. ఐపీసీ 509, 506 కింద కేసులు నమోదయ్యాయి” అని వివరించారు.

Read Also: నుపుర్ శర్మకు సపోర్ట్‌గా నిలిచిన గౌతం గంభీర్

×