Delhi Police: కొవిడ్ హాస్పిటల్‌లో బెడ్ దొరక్క హెడ్ కానిస్టేబుల్ మృతి

ప్రతి ఒక్కరిదీ అదే పరిస్థితి. ఎవ్వరికీ బెడ్ దొరకడం లేదని చెప్పారు. చివరికి సొంత ఊరు అయిన ...

Delhi Police: కొవిడ్ హాస్పిటల్‌లో బెడ్ దొరక్క హెడ్ కానిస్టేబుల్ మృతి

DEAD

Delhi Police: రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులకు హాస్పిటల్ లో వసతులు అందించడం కష్టమైపోతుంది నిర్వాహకులకు. మంగళవారం కొవిడ్ తో బాధపడుతూ.. హాస్పిటల్ కు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ హరీశ్ తన్వార్ కు బెడ్ దొరక్క ప్రాణాలు కోల్పోయాడు.

నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని కరావల్ నగర్ లో ఉండే వ్యక్తి సమైపూర్ బడ్లీ పోలీస్ స్టేషన్లో పనిచేసేశాడు. కొవిడ్ పాజిటివ్ అని తెలిశాక అతణ్ని చేర్పించుకునేందుకు ఐదు హాస్పిటల్స్ నిరాకరించారు. చివరకు మీరట్ లో జాయిన్ అయ్యాక చనిపోయాడు.

ఏప్రిల్ 14న హరీశ్ తన్వార్ కు డ్యూటీ నుంచి వస్తుండగా జ్వరమొచ్చినట్లు అనిపించింది. ఆ తర్వాత మూడు రోజులు అలాగే ఉంది. హారీశ్ కజిన్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 18న పరిస్థితి సీరియస్ గా ఉండటం, శ్వాస అందకపోతుండటంతో హాస్పిటల్ కు తీసుకెళ్లాలనకున్నాం. ఆ కుటుంబం హాస్పిటల్ లో బెడ్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది.

అతని పరిస్థితి తెలిసినా తోటి ఉద్యోగులెవ్వరూ సాయం చేయలేదు. ప్రతి ఒక్కరిదీ అదే పరిస్థితి. ఎవ్వరికీ బెడ్ దొరకడం లేదని చెప్పారు. చివరికి సొంత ఊరు అయిన మీర్ తీసుకెళ్లి అడ్మిట్ చేసేసరికి సంతోష్ హాస్పిటల్ యాజమాన్యం కొవిడ్ పరీక్ష జరిపి.. అతని ఊపిరితిత్తులు 90శాతం ఎఫెక్ట్ అయ్యాయని బెటర్ హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పింది.

అప్పుడే ఐఐఎమ్టీ లైఫ్ లైన్ హాస్పిటల్ కు వెళ్లగా వెంటిలేటర్ సపోర్ట్ కొరత ఉందని అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారు. అప్పుడు సుధా హాస్పిటల్ లో వెంటిలేటర్ సపోర్ట్ దొరకడంతో అడ్మిట్ చేశారు. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అతని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి మంగళవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో చనిపోయాడు.

హరీశ్ 2003లో ఢిల్లీ పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత 2014లో హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ అందింది. ఇద్దరు పేరెంట్స్ తో పాటు భార్య, మైనర్ పిల్లలతో ఉంటున్నాడు హరీశ్.