Wrestlers Protest: రెజ్లర్లకు షాకిచ్చిన పోలీసులు.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు ఇక నో ఫర్మిషన్ ..

రెజ్లర్ల ధర్నాకు భారీగా మద్దతు పెరగడంతో జంతర్ మంతర్ నుంచి రెజ్లర్ల నిరసనను ఢిల్లీ పోలీసులు తొలగించారు.

Wrestlers Protest: రెజ్లర్లకు షాకిచ్చిన పోలీసులు.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు ఇక నో ఫర్మిషన్ ..

Wrestlers Protest

Wrestlers Protest: జంతర్ మంతర్ వద్ద ఇకపై రెజ్లర్ల నిరసనకు అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆదివారం పోలీసుల అభ్యర్థనను పట్టించుకోకుండా పార్లమెంట్ మార్చ్‌ను రెజ్లర్లు చేపట్టి చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న నిరసన దీక్ష ముగిసిందని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. రెజ్లర్లు భవిష్యత్తులో మళ్లీ నిరసనకు దరఖాస్తు చేస్తే.. జంతర్ మంతర్ కాకుండా అనువైన ప్రదేశంలో వారి నిరసనకు అనుమతిస్తామని చెప్పారు.

Wrestlers Protest: బ్రిజ్ భూషణ్ నార్కో టెస్ట్ సవాల్‌కు మేం సిద్ధం.. అలా అయితేనే అంటూ షరతు పెట్టిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన చేపట్టాడు. 38 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగింది. భూషణ్ శరణ్ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేదించారని, అతన్ని అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. అయితే, భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసి, తన పదవి నుంచి తొలగించాలని, అప్పటి వరకు తమ నిరసన కొనసాగుతుందని రెజ్లర్లు చెబుతూ వచ్చారు.

Wrestlers Protest: పోలీసు మద్యం మత్తులో మమ్మల్ని దుర్భాషలాడాడు.. అర్థరాత్రి గొడవపై కన్నీరు పెట్టుకున్న రెజ్లర్లు

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ భవనం ఎదుట మహిళా రెజ్లర్లు పంచాయత్‌కి పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాలకు అనుమతి లేనందున రెజ్లర్లు, రైతు నేతలు, ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రెజ్లర్లకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. రెజ్లర్ల ధర్నా‌కు కాంగ్రెస్, ఆప్, వామపక్షాలు, కార్మిక సంఘాలు, రైతులు సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక వేత్తలు మద్దతు తెలిపారు.

Wrestlers Protest: జంతర్ మంతర్ వద్ద అర్థరాత్రి పోలీసులకు, రెజ్లర్లకు మధ్య వాగ్వాదం.. అమిత్ షాకు బజరంగ్ పునియా లేఖ

రెజ్లర్ల ధర్నాకు భారీగా మద్దతు పెరగడంతో జంతర్ మంతర్ నుంచి రెజ్లర్ల నిరసనను ఢిల్లీ పోలీసులు తొలగించారు. ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లు, రైతు సంఘం నేతలు, ఆందోళన కారులను అరెస్ట్ చేశారు. రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ భోగాట్, భజరంగ్ పునియా, విజయేందర్ సహా రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ ఎదుట నిరసన సమయంలో పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని రెజ్లర్లు ఆరోపించారు. వీరి ఆరోపణలపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. ఏ మహిళా క్రీడాకారిణితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదని తెలిపారు. మహిళా పోలీసులు మాత్రమే అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.