Delhi Pollution : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్‌‌పై కేంద్రం క్లారిటీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనే దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తన అభిప్రాయాన్ని వెలువరించింది.

Delhi Pollution : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్‌‌పై కేంద్రం క్లారిటీ

Delhi Supream Court

Delhi Pollution : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనే దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తన అభిప్రాయాన్ని వెలువరించింది. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంలో అఫిడవిట్ నమోదైంది. 2021, నవంబర్ 17వ తేదీ బుధవారం విచారణ జరిగింది. కరోనా తర్వాత..పరిస్థితులు మారిపోతున్నాయని, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ తరుణంలో..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని తాము ఆదేశించలేమని తెలిపింది. వాహనాల సంఖ్యను తగ్గించేందుకు పలు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఉద్యోగులు వాడుతున్న వాహనాల సంఖ్య చాలా తక్కువని పేర్కొంది. వారి వాహనాలను నిలిపివేయడం వల్ల వాయు నాణ్యతలో ఎలాంటి పెరుగుదల ఉండదని సుప్రీంకు కేంద్రం తెలిపింది.

Read More : Union Minister Helps Passenger : విమానంలో తోటి ప్రయాణికుడికి కేంద్రమంత్రి సాయం..ప్రశంసించిన మోదీ

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో పెరిగిన దుమ్ము ధూళి, కాలుష్య కారకాల శాతంతో రోడ్లపై విజిబులిటీ తగ్గిపోయింది. వాయుకాలుష్యం నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలున్నవారు బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో… వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సిఎక్యూఎం) నిర్మాణ పనులపై నిషేధం, ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం, ఇంటి నుండి పని చేయడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించే ఇతర చర్యల వంటి ఆదేశాలను మంగళవారం జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై సుప్రీంకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది.