Covid-19 India Updates : ఢిల్లీలో కరోనా తగ్గుముఖం.. పాజిటివిటి రేటు ఎంతంటే?

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 576 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మరో 103 కరోనా మరణాలు నమోదయ్యాయి.

Covid-19 India Updates : ఢిల్లీలో కరోనా తగ్గుముఖం.. పాజిటివిటి రేటు ఎంతంటే?

Corona Delhi

Covid-19 India Updates : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 576 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మరో 103 కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే 1,287మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఢిల్లీలో 0.78 శాతానికి పాజిటివి రేటు తగ్గింది. దాంతో పాజిటివిటీ రేటు మూడవ రోజు 1 శాతం కంటే తక్కువగా నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీలో 9,364 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 14,27,439 కేసులు నమోదయ్యాయి. 24,402 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 73,451 కరోనా టెస్టులు నిర్వహించారు.

ఢిల్లీలో 1.71 శాతంగా మరణాల రేటు నమోదైంది. మరోవైపు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,32,788 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు కాగా.. 3,207 కరోనా మరణాలు నమోదయ్యాయి. 26,500కి పైగా కరోనా కేసులతో దేశంలో రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా తమిళనాడులోనే నమోదయ్యాయి. ఇక యాక్టివ్ కేసులు లక్షకు పైగా తగ్గాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 17.93 లక్షలుగా నమోదైంది.

వారానికి 5 శాతం కంటే తక్కువ పాజిటివిటి రేటు, జనాభాలో 70 శాతం టీకాలు వేయడం, కొవిడ్ నిబంధనలు పాటించడం వంటి చర్యల ద్వారా కరోనాను కంట్రోల్ చేయడం సాధ్యపడుతుందని కేంద్రం పేర్కొంది. భారతదేశంలోని 718 జిల్లాల్లో దాదాపు సగం ఇప్పుడు ఏడు రోజుల పాజిటివిటీని 5 శాతం కంటే తక్కువగా నమోదయ్యాయి. 45పైబడిన వయస్సు గల వారిలో 32 శాతం మందికి మాత్రమే మొదటి డోసు అందింది.