ఢిల్లీలో రికార్డు స్థాయి టెంపరేచర్.. 58ఏళ్ల తర్వాత ఇలా

ఢిల్లీలో రికార్డు స్థాయి టెంపరేచర్.. 58ఏళ్ల తర్వాత ఇలా

Delhi Weather: ఢిల్లీలో వాతావరణం 1962 తర్వాత ఇంత కూల్ గా మరెప్పుడూ లేదని ఐఎండీ చెప్తుంది. 16.9 డిగ్రీ సెల్సియస్‌గా మాత్రమే నమోదైందని ఇండియా మెటరాలాజికల్ డిపార్ట్‌మెంట్ డేటా సూచిస్తుంది. సాధారణంగా ఢిల్లీలో అక్టోబర్ నెల కనీస ఉష్ణోగ్రత 19.1 డిగ్రీ సెల్సియస్ గా ఉంటుంది.

గురువారం ఢిల్లీలో అక్టోబరు నెల కనీస ఉష్ణోగ్రత 26 ఏళ్ల తర్వాత 12.5డిగ్రీ సెల్సియస్ గా ఉంది. 1994తర్వాత ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఇదే. సాధారణ కనీస ఉష్ణోగ్రత 15-16 డిగ్రీల సెల్సియస్ గా ఉండాలని ఐఎండీ చెప్పింది.



ఐఎండీ వాతావరణ ముందస్తు సమాచార కేంద్ర హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ.. మేఘావృతమై ఉండటమే దీనికి కారణం అయి ఉండొచ్చని చెప్పారు. మరో కారణం చల్లటి గాలులు అయి ఉండొచ్చు. తేమ, పొగమంచు కారణంగా ఇలా తక్కువగా మారే అవకాశాలు ఉన్నాయని శ్రీవాస్తవ అన్నారు.

ఢిల్లీలో 1937 అక్టోబరు 31న 9.4డిగ్రీ సెల్సియస్ కనీస ఉష్ణోగ్రత నమోదైంది.