Prisoners escape : జైల్లో రద్దీ తగ్గుతుందని పెరోల్​ ఇస్తే..3,000 మంది ఖైదీలు ఎస్కేప్

Prisoners escape : జైల్లో రద్దీ తగ్గుతుందని పెరోల్​ ఇస్తే..3,000 మంది ఖైదీలు ఎస్కేప్

Prisoners Escape

Tihar jail, more than 3,000 inmates ‘missing’ : కరోనా మహమ్మారి చేసే చిత్రాలు..విచిత్రాలు ఎన్నని చెప్పాలి? ఎంత పనిచేసింది? జైల్లో రద్దీని తగ్గిద్దామని ఖైదీలకు పెరోల్ ఇస్తే వాళ్లంతా జైలులకు ‘టాటా, బై బై’లు చేప్పేశారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఈ మహమ్మారి జైళ్లను కూడా వదలటంలేదు. దీంతో తీహార్ జైల్లో రద్దీని తగ్గిందామని అధికారులు ఖైదీలకు పెరోల్ ఇస్తే వాళ్లు కాస్తా పత్తా లేకుండా పోయారు. దీంతో తీహార్ జైలు అధికారులు తలపు పట్టుకున్నారు. ఏం చేయాలో పాలుపోక..తిహార్ జైలు అధికారులు ఢిల్లీ ఏరియా పోలీసులను సంప్రదించాల్సి వచ్చింది.

కాగా కరోనా మహమ్మారి తీవ్రంగా ఉండటంతో ఢిల్లీ హైకోర్టు తీహార్ జైల్లోని ఖైదీలకు అత్యవసర పెరోల్ ఇవ్వాలని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో ధర్మాసన ఆదేశాలను పాటించిన పోలీసు యంత్రాంగ ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి 5,556 మందిని తిహార్ జైలు అధికారులు పెరోల్ మీద విడుదల చేశారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. పెరోల్ పూర్తి అయ్యాక దాదాపు 3,300 మందికిపైగా ఖైదీలు తిరిగి జైలు ముఖం చూడలేదు. ఎస్కేప్ అయ్యారు. టాటా బైబైలు చెప్పేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు పరారీలో ఉన్న ఖైదీలను పట్టుకోవటానికి తిహార్ జైలు అధికారులు ఢిల్లీ పోలీసులను సంప్రదించారు.

2020లో అత్యవసర పెరోల్ లో భాగంగా 1,184 మంది దోషులుగా తేలిన ఖైదీలను విడిచిపెట్టగా.. 1,072 మంది తిరిగి జైలుకు వచ్చేశారు. 112 మంది తప్పించుకుపారిపోయారు. ఇటు 5,556 మంది విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలనూ పెరోల్ మీద జైలు అధికారులు విడుదల చేశారు. అందులో 2,200 మందికిపైగా వచ్చినా.. మిగతా 3,300 మందికి పైగా పత్తా లేకుండా పోయారు.

దీంతో పరార్ అయిన ఖైదీలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఢిల్లీ పోలీసులకు ఇచ్చి.. వారిని పట్టివ్వాలని కోరారు తీహార్ జైలు అధికారులు. విచారణ ఖైదీల్లో కొందరు సరెండర్ అవుతామంటున్నారని..మిగిలినవారు మాత్రం బెయిల్ తీసుకున్నారని కొందరు అధికారులు చెబుతున్నారు. కాగా..విడుదల చేసిన ఖైదీల్లో చాలా మందికి ఎయిడ్స్, క్యాన్సర్, మూత్రపిండాల జబ్బులు, ఆయాసం, క్షయ వంటి వ్యాధులున్నాయని చెబుతున్నారు. కాగా..తిహార్ జైలులో 10 వేల మందికిపైగా ఖైదీలను ఉన్నట్లుగా తెలుస్తోంది.