Delhi Covid : ఢిల్లీలో 24 గంటల్లో 255 కరోనా కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజలుగా వైరస్ తో ముప్పుతిప్పలు పడ్డ ప్రజానీకం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 24 గంటల్లో 255 కొత్త కేసులు వెలుగు చూశాయి. పాజివిటి రేటు 0.35గా ఉంది. 24 గంటల్లో 23 మంది కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు.

Delhi Covid : ఢిల్లీలో 24 గంటల్లో 255 కరోనా కేసులు

Delhi Covid

Delhi Covid Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజలుగా వైరస్ తో ముప్పుతిప్పలు పడ్డ ప్రజానీకం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 24 గంటల్లో 255 కొత్త కేసులు వెలుగు చూశాయి. పాజివిటి రేటు 0.35గా ఉంది. 24 గంటల్లో 23 మంది కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. మొత్తంగా మరణించిన వారి సంఖ్య 24 వేల 823 చేరుకుంది. 3 వేల 466 యాక్టివ్ కేసులున్నాయి. 376 వైరస్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు.

మొత్తం 14, 02, 850 డిశ్చార్జ్ అయ్యారు. శనివారం రోజు 28 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం 44 మంది, బుధవారం 36 మంది మృత్యువాత పడ్డారు. 72 వేల 751 శాంపిల్స్ పరీక్షించారు. శనివారం 71 వేల 513 టెస్టులు నిర్వహించారు.

మరోవైపు ఢిల్లీలో కేసులు తగ్గుముఖం పడుతుండడంతో అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇచ్చింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న సరి – బేసి విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. 2021, జూన్ 14వ తేదీ సోమవారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అయితే..విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసే ఉంటాయని, మతపరమైన పండుగలు, విద్యా, సాంస్కృతిక, క్రీడలపై ఆంక్షలు కొనసాగనున్నాయని వెల్లడించారు. గ్రూప్ ఏ అధికారులు వంద శాతం, మిగతా గ్రూపుల్లో 50 శాతం సిబ్బంది విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటు కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి..ఇందులో 50 శాతం సిబ్బందితో నిర్వహించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

Read More : హైదరాబాద్ మరోసారి మునుగుతుందా..?