Omicron In Delhi : ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు..దేశవ్యాప్తంగా ఎన్నంటే..

దేశ రాజధానిలో క్రమంగా కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్

Omicron In Delhi : ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు..దేశవ్యాప్తంగా ఎన్నంటే..

Omicron (7)

Omicron In Delhi : దేశ రాజధానిలో క్రమంగా కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. దీంతో ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. ప్రస్తుతం తొమ్మిది మంది బాధితులు లోక్ నాయక్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతుండగా, మరోకరు వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక,అనుమానంతో 40 మందిని లోక్‌ నాయక్‌ హాస్పిటల్ లో చేర్చినట్లు సత్యేందర్ జైన్ తెలిపారు. కొత్త కోవిడ్ వేరియంట్ కేసులను గుర్తించి ప్రత్యేక ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఒమిక్రాన్‌ కేసులు బయటపడుతున్నాయని, అందుకోసమే కచ్చితమైన పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని రకాల ఒమిక్రాన్‌ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు వెలుగుచూస్తుండటంతో ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ దేశ రాజధాని పరిధిలో నిషేదాజ్ఞాలు అమలుచేస్తోంది. బార్లు, రెస్టారెంట్లు 50 శాతం కెపాసిటితో నడుపుకోవాలని, బాంక్వెట్‌ హాల్స్‌కు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. వచ్చే నెల 1 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది.

ఇక, ఢిల్లీలో నాలుగు కొత్త కేసులు నమోదవడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 77కి పెరిగింది.