Delhi Riots : చిన్న ఆస్పత్రి ఎన్నో ప్రాణాలను నిలబెట్టింది

  • Published By: madhu ,Published On : February 28, 2020 / 10:35 AM IST
Delhi Riots : చిన్న ఆస్పత్రి ఎన్నో ప్రాణాలను నిలబెట్టింది

ఢిల్లీ అల్లర్లు, హింసలో ఎన్నో విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 42మందిని బలిగొన్న ఈ అల్లర్లు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కానీ ఓ చిన్న ఆస్పత్రి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. అది కూడా జడ్జీల సహాయంతో. అవును మీరు వింటున్నది నిజమే. ఆస్పత్రి సూపరిటెండెంట్‌కు జడ్జీలు ఫోన్ చేయడం..వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయడంతో ఆ చిన్న ఆస్పత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న వారిని సురక్షితంగా ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఇదంతా…జస్టిస్ మురళీధరన్ ఇచ్చిన ఆదేశాలతోనే. 

వివరాల్లోకి వెళితే…
2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రాత్రి న్యూ ముస్తాఫాబాద్‌లో ఉన్న అల్ – హింద్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్. ఎం.ఎ. అన్వర్‌‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ చేసింది ఎవరో కాదు.. జస్టిస్ ఎస్. మురళీధరన్. ఆస్పత్రిలో రెండు మృతదేహాలున్నాయని, 22 మంది తీవ్రగాయాలతో ఉన్నారని..వీరిని ఆస్పత్రులకు తరలించేందుకు తాము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమౌతున్నాయని అన్వర్ వెల్లడించారు. పోలీసుల సాయం కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు.

ఈ విషయాన్ని వెంటనే కోర్టు పోలీసులకు చెప్పింది. వెంటనే సాయం చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంబులెన్స్‌ల్లో రోగులు, వారికి రక్షణగా పోలీసులు..పెద్ద ఆసుపత్రులకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం వరకు జరిగిన ఘర్షణల్లో ఎంతో మంది గాయపడ్డారని, ప్రధానంగా ముస్తాఫాబాద్, చాంద్ బాగ్ ప్రాంతాల నుంచి అధికం సంఖ్యలో గాయాలపాలైన వారు తమ ఆసుపత్రికి వచ్చారని అన్వర్ తెలిపారు.

ఈ సమయంలో తమ వద్ద 22 మంది రోగులున్నారని తెలిపారు. కానీ వీరికి అత్యవసర చికిత్స అందించాల్సినవసరం ఉండగా..పోలీసుల సహాయం అందలేదన్నారు. రెండు మరణాలు సంభవించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తగినన్ని సంఖ్యలో బెడ్స్ లేకపోవడంతో చికిత్స తీసుకుంటూ..నేలపైనే పడుకున్నారని వివరించారు. ప్రారంభంలో…102కు అన్వర్ ఫోన్ చేసినా..ఈ సమయంలో ఆ ప్రాంతానికి అంబులెన్స్‌ పంపలేమనే సమాధానం అవతలి నుంచి వచ్చింది. అనేక ఆస్పత్రల్లో ఉన్న స్నేహితులకు, ఇతరులకు ఫోన్ చేశారు. వారు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసినా..ముస్తాఫాబాద్‌లోకి ప్రవేశించలేకపోయింది. భద్రత పేరిట అంబులెన్స్‌ను పోలీసులు ఆపివేశారు. 

ఇదే ఆస్పత్రిలో యంగ్ డాక్టర్ మొహమ్మద్ వసీం అక్రం కూడా పనిచేస్తున్నారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, గాయాలపాలై వచ్చిన వారికి తాము ఆక్సిజన్ మాస్క్‌లు అందించలేకపోయామన్నారు. ఆక్సిజన్ లభించకపోవడంతో ఇద్దరు మరణించారని ఆవేదన వెలిబుచ్చారు. 

ఈ సమయంలో జస్టిస్ మురళీధరన్ వీడియో కాల్ చేయాలని చెప్పారని, కానీ తాము వాయిస్ కాల్ మాత్రమే చేయగలిగామన్నారు అన్వర్. తర్వాత వచ్చిన ఆదేశాలతో తాము కొంత రిలాక్స్ అయ్యామన్నారు. 

ఢిల్లీలో జరిగిన అల్లర్లు, హింసలో మరణించి..తీవ్రంగా గాయపడి చిన్న చిన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని GTB, LNGP, లాంటి పెద్దాసుపత్రులకు పంపే పరిస్థితులు లేవని, సురక్షితంగా బాధితులు తరలించేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ…సరూర్ మందర్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు సమయం అర్ధరాత్రి దాటి 1గంట అవుతోంది.

విషయం తెలుసుకున్న జస్టిస్ ఎస్. మురళీధర్, జస్టిస్ అనూప్ బంభానీలతో కూడిన బెంచ్ ఏర్పాటైంది. పోలీసు అధికారులను వెంటనే జస్టిస్ మురళీధర్ ఇంటికి రావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అక్కడనే విచారణ చేపట్టారు. బాధితులను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించేదుకు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో..బీజేపీ నేతలపై చేసిన విమర్శలు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయవాది జస్టిస్ ఎస్. మురళీధరన్‌పై బదిలీ వేటు పడడం చర్చానీయాంశమైంది. 

Read More : APలో ACB ఫీవర్ : అవినీతిపరుల పేర్లను చెప్పాలి – ACB DG లేఖ