కుంగిపోయిన మెట్రో రోడ్డు.. గుంతలో కారు, ఆటో

అప్పటివరకూ వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. భూకంపం రాలేదు. కానీ, ఉన్నట్టుండి రోడ్డు పెద్ద గుంత ఏర్పడింది.

  • Published By: sreehari ,Published On : January 15, 2019 / 09:28 AM IST
కుంగిపోయిన మెట్రో రోడ్డు.. గుంతలో కారు, ఆటో

అప్పటివరకూ వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. భూకంపం రాలేదు. కానీ, ఉన్నట్టుండి రోడ్డు పెద్ద గుంత ఏర్పడింది.

న్యూఢిల్లీ: అప్పటివరకూ వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. భూకంపం రాలేదు. కానీ, ఉన్నట్టుండి రోడ్డు పెద్ద గుంత ఏర్పడింది. ఎందుకు రోడ్డు కుంగిపోయిందో తెలియక అక్కడి వారంతా షాకయ్యారు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న కారు, ఆటోరిక్షా కూడా కుంగిపోయిన రోడ్డుగుంతలో చిక్కుకున్నాయి. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రాణహని జరగలేదు. కారులో ఇద్దరు వ్యక్తులు ఉండగా, ఆటోరిక్షాలో ఒకరు ఉన్నారు. చిన్న గాయలతో బయటపడ్డారు. ఈ ఘటన దేశ  రాజధాని తూర్పు ఢిల్లీలోని మజ్ పూర్-బబర్ పూర్ మెట్రో స్టేషన్ దగ్గర చోటుచేసుకుంది.

దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పీడబ్ల్యూడీ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై గుంతలో చిక్కుకున్న కారు, ఆటోరిక్షాను క్రేన్ సాయంతో బయటకు తీశారు. రోడ్డు కింద అమర్చిన పైపు లైన్ దెబ్బతినడంతో రోడ్డు ఒక్కసారిగా కుదుపుకు గురైనట్టు  అధికారులు వెల్లడించారు. రోడ్డుపై పడిన పెద్ద గుంతను చూసేందుకు భారీసంఖ్యలో జనం చుట్టుముట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.