Delhi : నా కలను నిజం చేశారు..థాంక్స్ కేజ్రీజీ

నా కలను సీఎం కేజ్రీవాల్ నేరవేర్చారు..థాంక్స్ కేజ్రీజీ అంటూ బీజేపీ లీడర్ చెబుతున్నారు. ఆయన కల ఏంటీ ? సీఎం నెరవేర్చడం ఏంటీ ?

Delhi : నా కలను నిజం చేశారు..థాంక్స్ కేజ్రీజీ

Delhi

Delhi BJP : నా కలను సీఎం కేజ్రీవాల్ నేరవేర్చారు..థాంక్స్ కేజ్రీజీ అంటూ బీజేపీ లీడర్ చెబుతున్నారు. ఆయన కల ఏంటీ ? సీఎం నెరవేర్చడం ఏంటీ ? అనుకుంటున్నారా ? తన కల నెరవేర్చారంటూ..ఆ బీజేపీ లీడర్ దెప్పిపొడిచారు. ఢిల్లీలో ఎలాంటి వర్షం కురిసిందో అందరికీ తెలిసిందే. దీంతో రహదారులన్నీ నీట మునిగాయి. ఎయిర్ పోర్టులోకి నీరు చేరడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read More : Rakesh Tikait : ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీవర్షం.. నడుము లోతు నీటిలో రైతుల నిరసన.. ఫొటోలు వైరల్!

దీంతో బీజేపీ జనతా యువత మోర్చాకు చెందిన…తజీందర్ పాల్ సింగ్ బగ్గా…రోడ్డు మీదకు వచ్చారు. ఓ పడవను సిద్ధం చేసుకుని..అందులో కూర్చొని…వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వర్షపు నీటిలో బోటులో తిరుగుతూ…కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వర్షపు నీటిలో షికారు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో ఉంచడంతో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఢిల్లీ ప్రభుత్వ చర్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Read More : Delhi Airport : జల దిగ్బంధంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు.. వరద నీటిలో నిలిచిన విమానాలు

భారతీయ జనతా యువ మోర్చాకు చెందిన తజీందర్ సింగ్ బగ్గా…వినూత్న శైలిలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సీజన్ లో పడవ విహారం కోం రిషికేష్ వెళ్దామని అనుంటున్నా…కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టడంతో వీలు కాలేదని, కానీ..నా కలను నిజం చేస్తూ…ఢిల్లీలోనే ఆ ఏర్పాటు చేసిన ఢిల్లీ సీఎంకు కేజ్రీవాల్ కు ధన్యవాదాలు చెబుతున్నాటూ వీడియోలో వెల్లడించారు. మరోవైపు..ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. నగరంలో చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్ నెలలోనే 383 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 1944లో 417.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా…మళ్లీ అదే స్థాయిలో ఇప్పుడు వర్షం కురిసింది.