Rainfall : ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు..ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద భారీగా నిలిచిన నీరు

దేశ రాజ‌ధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్ ఏరియాలో ఉద‌యం 7 నుంచి 8:30 గంట‌ల మ‌ధ్య‌లో 2.5 సెం.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. గంట‌కు 20 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.

Rainfall  : ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు..ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద భారీగా నిలిచిన నీరు

Delhi Rainfall

Delhi recorded 2.5 cm rainfall : దేశ రాజ‌ధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడపడితే అక్కడ నీరు భారీగా నిలిచిపోయింది. నైరుతి రుతుప‌వ‌నాలు ఢిల్లీని తాకటంతో వర్షాలు భారీగా కురిసాియి. కాగా ఈ సంత్సరం నైరుతి రుతుప‌వ‌నాలు ఢిల్లీకి ఆల‌స్యంగా తాకాయి. దీంతో వానకు కూడా ఆలస్యంగానే కురిసాయి. నైరుతి రుతుప‌వ‌నాలు ఢిల్లీకి ఆల‌స్యంగా చేర‌డం 15 ఏళ్లలో ఇదే మొదటిసారి అని వాతావరణ అధికారులు తెలిపారు.

నైరుతీ రుతుపవనాల ప్రభావంత సోమవారం (జులై 13) ఉద‌యం ఢిల్లీని వ‌ర్షాలు ముంచెత్తాయి. ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. అండ‌ర్ పాస్‌ల్లో భారీగా వ‌ర్ష‌పు నీరు నిల‌వ‌డంతో.. వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టూవీలర్స్ నీటిలో వెళ్లలేక బైకులను తోసుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. భారీగా కురిరసిన వర్షాలకు ఢిల్లీ ఎయిమ్స్ ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద భారీగా నీరు నిలిచిపోయింది.

ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్ ఏరియాలో ఉద‌యం 7 నుంచి 8:30 గంట‌ల మ‌ధ్య‌లో 2.5 సెం.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. గంట‌కు 20 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఢిల్లీకి స‌మీపంలోని ఎన్సీఆర్, గోహ‌నా, సోనిప‌ట్, రోహ‌త‌క్, కేక్రా ఏరియాల్లో కూడా వ‌ర్షం కురిసింది. కాగా..నిన్నటి వరకూ ఢిల్లీ వాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈక్రమంలో కురిసిన వర్షాలతో కాస్త ఉపశమనం పొందారు.కానీ వర్షాలు ఒక్కసారిగా కురవటంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడ్డారు. నిన్న‌టి వ‌ర‌కు ఎండలతో అల్లాడిపోయామని..దంచికొట్టిన వర్షం వల్ల హ్యాపీగా ఉందంటున్నారు ఢిల్లీ వాసులు.