JNU VC Santishree Dhulipudi : JNU తొలి మహిళా వైస్ చాన్సలర్ గా శాంతిశ్రీ ధూళిపూడి

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)కి తొలిసారి ఓ మహిళ వైస్ చాన్సలర్ గా నియమితులయ్యారు. జేఎన్ యూ కొత్త వైఎస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి నియమితులయ్యారు.

JNU VC Santishree Dhulipudi : JNU తొలి మహిళా వైస్ చాన్సలర్ గా శాంతిశ్రీ ధూళిపూడి

Jnu Vc Santishree Dhulipudi

JNU first woman VC Santishree Dhulipudi : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)కి తొలిసారి ఓ మహిళ వైస్ చాన్సలర్ గా నియమితులయ్యారు. జేఎన్ యూ కొత్త వైఎస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ నియమితులయ్యారు. వీసీగా నియమించబడిన శాంతిశ్రీ ఐదేళ్లపాటు బాధ్యతల్లో విధులు కొనసాగించనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిశ్రీ తెలుగు మూలాలున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారు కావటం విశేషం.

Also read : TS First IPS Salima : తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా షేక్ సలీమా రికార్డు

రష్యాలో పుట్టి తమిళనాడులో చదువుకున్న శాంతిశ్రీ తన 59 ఏళ్ల వయస్సులో ప్రతిష్టాత్మక జేఎన్ యూకి వీసీగా నియమితులయ్యారు. శాంతిశ్రీ రష్యాలో పుట్టినా తెలుగు కుటుంబ నేపథ్యం కలవారు. మహారాష్ట్రలోని సావిత్రిభాయి పులే యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేశారు. అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు. జేఎన్‌యూ పూర్వ విద్యార్థిని అయిన శాంతిశ్రీ ఇక్కడే ఎంఫిల్‌తోపాటు అంతర్జాతీయ సంబంధాలపై పీహెచ్‌డీ కూడా చేశారు.

Also read :  Pak first woman SC judge : పాకిస్తాన్‌ చరిత్రలో సంచలనం..సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ అయేషా మాలిక్‌..

తెలుగు వ్యక్తి అయిన ఎం. జగదీశ్ కుమార్ ఇటీవలి వరకు జేఎన్ యూ వైఎస్ చాన్సలర్ గా కొనసాగారు. ఆయన కొన్నిరోజుల క్రితం యూజీసీ చైర్మన్ గా వెళ్లడంతో ఆ పదవి ఖాళీ అయింది.ఆయన ఖాళీ చేసిన జేఎన్ యూ వీసీగా తొలిసారి ఓ మహిళ నియమితులు కావటం విశేషం. రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో పుట్టిన శాంతిశ్రీ విద్యాభ్యాసమంతా దాదాపుగా తమిళనాడులోని మద్రాసులోనే జరిగింది.

Also read :  Indian Army : ఆర్మీలో ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్ హోదా

శాంతిశ్రీ లెనిన్ గ్రాడ్ ఓరియెంటల్ ఫ్యాకల్టీ డిపార్ట్ మెంట్ లో తెలుగు, తమిళం ప్రొఫెసర్. తండ్రి ధూళిపూడి ఆంజనేయులు రచయిత, జర్నలిస్టు, రిటైర్డ్‌ సివిల్‌ సర్వెంటు. ఈయన స్వస్థలం తెనాలి. తల్లి మూలమూడి ఆదిలక్ష్మి రష్యాలోని లెనిన్‌గ్రాడ్‌ ఓరియంటల్‌ ఫ్యాకల్టీ డిపార్ట్‌మెంటులో తమిళ, తెలుగు ప్రొఫెసర్ గా పనిచేశారు. దీంతో శాంతిశ్రీకి తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో చక్కటి ప్రావీణ్యం ఉంది. కన్నడ, మలయాళం, కొంకణి భాషల్ని కూడా ఆమె చక్కగా అర్థం చేసుకోగలరు. గోవా వర్సిటీలో తొలిసారి ఉద్యోగిగా మొదలైన ఆ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి జేఎన్ యూ వీసీ స్థాయికి ఎదిగారు.

Also read :  Women Commandos for VIP: వీఐపీల రక్షణ కోసం మహిళా కమాండోలు..