Miranda House: మిరండా హౌజ్‌లోకి చొచ్చుకొచ్చిన ఆకతాయిలు.. అమ్మాయిలపై వేధింపులు.. స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని అమ్మాయిల క్యాంపస్ అయిన మిరండా హౌజ్‌లోకి ఆకతాయిలు అక్రమంగా ప్రవేశించి, అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Miranda House: మిరండా హౌజ్‌లోకి చొచ్చుకొచ్చిన ఆకతాయిలు.. అమ్మాయిలపై వేధింపులు.. స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్

Miranda House: ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మిరండా హౌజ్‌లోకి కొందరు ఆకతాయిలు అక్రమంగా చొచ్చుకొచ్చారు. క్యాంపస్‌లోకి చొరబడి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Nama Nageshwar Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ షాక్.. రూ.80.65 కోట్ల ఆస్తులు జప్తు

ఢిల్లీ మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించింది. ‘మిరండా హౌజ్ కాలేజ్’ పూర్తిగా అమ్మాయిలకు సంబంధించిన క్యాంపస్. ఇక్కడికి మగవారికి నిషేధం ఉంటుంది. ఈ క్యాంపస్‌లో అమ్మాయిలు, మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారు. తాజాగా ఈ క్యాంపస్ పరిధిలో ‘దివాళి మేళా’ పేరుతో దీపావళి సందర్భంగా స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించారు. దీనిలో క్యాంపస్ కాలేజ్‌కు చెందిన మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే, కొందరు పోకిరీలు క్యాంపస్‌లోకి అక్రమంగా చొరబడ్డారు. ఎత్తుగా ఉన్న గోడ ఎక్కి, లోపలికి దూకి కొందరు.. గేట్ దూకి మరికొందరు ఆకతాయి కుర్రాళ్లు మహిళల ఈవెంట్‌లోకి ప్రవేశించారు. అంతేకాకుండా అక్కడి మహిళలను తాకుతూ, వారితో అసభ్యంగా ప్రవర్తించారు. బూతులు, అసభ్య పదజాలం వాడుతూ హల్‌చల్ చేశారు.

Chandrababu Calls Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఫోన్.. కేసులు, అరెస్టులపై ఆగ్రహం

ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాల్ని కొందరు విద్యార్థినులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అబ్బాయిలకు ప్రవేశం లేని క్యాంపస్‌లోకి ఆకతాయిలు ఎలా వస్తున్నారో చూడండంటూ పేర్కొన్నారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని, నిందితుల్ని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఘటనపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసుల్ని కమిషన్ ఆదేశించింది.