Delhi Students: మాంసం తినేందుకు అనుమతించాలంటూ విద్యార్థుల ఆందోళన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

గతంలో కాలేజ్ హాస్టల్‌లో మాంసం వడ్డించే వాళ్లు. అయితే, ఇటీవల మాంసంపై నిషేధం యాజమాన్యం విధించింది. విద్యార్థులకు శాకాహారం మాత్రమే అందిస్తామని చెప్పింది. అలాగే బయట నుంచి మాంసాహారం తెచ్చుకున్నా అనుమతించడం లేదు.

Delhi Students: మాంసం తినేందుకు అనుమతించాలంటూ విద్యార్థుల ఆందోళన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Delhi Students: కాలేజ్ క్యాంపస్‌లో మాంసంపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించిన విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో శుక్రవారం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హన్స్‌రాజ్ కాలేజ్ క్యాంపస్‌లో మాంసాహారంపై ఇటీవల నిషేధం విధించింది యాజమాన్యం.

Kerala: కాలేజీలో హీరోయిన్‌తో విద్యార్థి అసభ్య ప్రవర్తన.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

గతంలో కాలేజ్ హాస్టల్‌లో మాంసం వడ్డించే వాళ్లు. అయితే, ఇటీవల మాంసంపై నిషేధం యాజమాన్యం విధించింది. విద్యార్థులకు శాకాహారం మాత్రమే అందిస్తామని చెప్పింది. అలాగే బయట నుంచి మాంసాహారం తెచ్చుకున్నా అనుమతించడం లేదు. దీంతో ఈ నిర్ణయంపై పలువురు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, క్యాంపస్‌లో మాంసాహారం అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)కు చెందిన విద్యార్థులు కాలేజ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. విద్యార్థులు కాలేజీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, యాజమాన్యం అనుమతించలేదు. దీంతో కాలేజ్ గేట్ల వద్దే విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

Swati Maliwal: స్వాతి మాలివాల్‌ను కారుతో లాక్కెళ్లిన వీడియో విడుదల.. స్వాతిపై బీజేపీ విమర్శలు

దీనిపై పోలీసులు స్పందించారు. నిరసన విరమించాల్సిందిగా కోరారు. దీనికి విద్యార్థులు నిరాకరించడంతో కొందరు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం సాయంత్రం వారిని వదిలిపెట్టారు. ఈ అంశంపై కాలేజ్ ప్రిన్సిపాల్ స్పందించారు. ‘‘ఇది ఆర్య సమాజ్‌కు చెందిన కాలేజ్. మా సిద్ధాంతం ప్రకారం మాంసం తినడం నిషేధం. అందువల్లే మాంసంపై నిషేధం విధించాం. ఇక్కడి విద్యార్థుల్లో 90 శాతం మంది శాకాహారులే. అందువల్ల ఎక్కువ మందికి సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేజ్‌లో మాంసాహారం అనుమతించం’’ అని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.