Delhi : రోహిణి కోర్టు కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు సీజే సీరియస్

ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పులు ఘటనపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Delhi : రోహిణి కోర్టు కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు సీజే సీరియస్

Delhi Rohini Court Shooting

Delhi: Rohini court shooting incident seriously : దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో న్యాయవ్యవస్థే కాదు దేశం యావత్తు ఒక్కాసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఘటనపై సీజే రమణ  ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.ఎన్. పటేల్ తో మాట్లాడారు. దీంట్లో భాగంగా పోలీసులు, బార్ కౌన్సిల్ సభ్యులతో మాట్లాడాలని సూచించారు.

Read more : Delhi Court : కోర్టులో గ్యాంగ్‌‌స్టర్‌‌ల మధ్య కాల్పులు, జితేందర్ గోగి హతం

 

కోర్టు కార్యకలాపాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కోర్టుల భద్రత విషయం అనే విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని తెలిపారు. కాగా..న్యాయమూర్తుల భద్రత, న్యాయస్థానాల్లో భద్రతా చర్యలపై సుప్రీంకోర్టు ఇప్పటికే సుమోటాగా తీసుకుని విచారణ జరుపుతోంది. ఈక్రమంలో రోహిణి కోర్టు ఆవరణలో జరిగిన కాల్పులతో మరోసారి న్యాయస్థానాల భద్రత విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ కాల్పుల ఘటనకు ప్రాధాన్యతనిస్తామని..వచ్చేవారం ఈవిషయంపై విచారణ జరుపుతామని సీజే తెలిపారు.

 

Read more : Rohini court : ఎవరీ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి, ఎక్కడుండే వాడు ? ఏం చేస్తుంటాడు ?

కాగా శుక్రవారం రోహిణి కోర్టు ఆవరణలో ఓ గ్యాంగ్ స్టర్ ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ జితేందర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులపై ఎదురు కాల్పులు జరుపగా ఇద్దరు చనిపోయారు.

ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని జస్టిస్ రమణ పరిశీలించాలనుకున్నారు. కానీ భద్రతా కారణాల రిత్యా ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తితో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. కాగా..కోర్టు ఆవరణలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక బుల్లెట్లు న్యాయాధికారి వేదికను తాకిన విషయం తెలిసిందే.

Read more :Gangster Jitender Gogi : గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిని ఎవరు చంపారు ? కోర్టుకు ప్రత్యర్థులు ఎలా వచ్చారు ?