Delhi : ఢిల్లీ పేరు మార్చి ‘ఇంద్రప్రస్థ’ అని పెట్టాలంటూ డిమాండ్

ఢిల్లీ పేరు మార్చి ‘ఇంద్రప్రస్థ’ అని పెట్టాలని అఖిల భారత హిందూ మహాసభ, సంత్ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు.

Delhi : ఢిల్లీ పేరు మార్చి ‘ఇంద్రప్రస్థ’ అని పెట్టాలంటూ డిమాండ్

Change Delhi Name To Indraprastha

change Delhi name to Indraprastha : నగరాలకు పేర్లు మార్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ క్రమంలో ఢిల్లీ పేరు మార్చాలని అఖిల భారత హిందూ మహాసభ, సంత్ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’అని పెట్టాలని చక్రపాణి డిమాండ్ చేస్తూ మార్చాల్సిందిగా ప్రధాని మోడీ, ఢిల్లీ సీఎం అరివింత్ కేజ్రీవాల్ ను కోరారు చక్రపాణి. ఇంద్రప్రస్థ అంటే ఇంద్రుని రాజ్యమని అంటూ చెప్పుకొచ్చారు.

ఈ విషయంపై చక్రపాణి మాట్లాడుతూ..‘‘మహాభారతంలో కూడా ప్రస్తుతం ఢిల్లీగా ఉన్న పేరును ‘ఇంద్రప్రస్థ’గానే పేర్కొన్నారని తెలిపారు. తోమర్ కాలంలో ఒక రాజు వదులుగా ఉన్న ఇనుప కర్రను ఏర్పాటు చేశాడని… ప్రజలు దీన్ని ధిలి (వదులుగా) అని పిలిచేవారని… ఆ తర్వాత దిల్లీగా, ఢిల్లీగా మారిందని చెప్పుకొచ్చారాయన.

బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా దాదాపు 40 ప్రాంతాల పేర్లను మార్చాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాసిన మరుసటి రోజు..స్వామి చక్రపాణి మహారాజ్ శుక్రవారం (ఏప్రిల్ 29,2022) దేశ రాజధానికి ఇంద్రప్రస్థగా పేరు మార్చాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పేరు మార్చటంపై తమ సంస్థ సంతకాల ప్రచారాన్ని చేపడుతుందని చక్రపాణి తెలిపారు. కాగా..అయితే పేరు మార్పు విషయంలో ఢిల్లీ సీఎంఓ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.