మే చివరి నాటికి ఢిల్లీలో 44 కొత్త ఆక్సిజన్ ఫ్లాంట్లు

మే చివరి నాటికి ఢిల్లీలో వివిధ హాస్పిటల్స్ లో కొత్తగా 44 ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి

మే చివరి నాటికి ఢిల్లీలో 44 కొత్త ఆక్సిజన్ ఫ్లాంట్లు

Delhi To Have 44 Oxygen Plants By Next Month Arvind Kejriwal

Kejriwal మే చివరి నాటికి ఢిల్లీలో వివిధ హాస్పిటల్స్ లో కొత్తగా 44 ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో కొవిడ్‌ పరిస్థితిపై మంగళవారం ఆన్ లైన్ మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ… గతవారంలో ఉన్న ఆక్సిజన్‌ సంక్షోభం నుంచి గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపారు. కొత్త రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం కూడా ప్రారంభించామని తెలిపారు.

తమ ప్రభుత్వం థాయ్ లాండ్ నుంచి 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు,ఫ్రాన్స్ నుంచి 21 రెడీ టూ ఆక్సిజన్‌ ప్లాంట్లను దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. బ్యాంకాక్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకునేందుకుగాను ఎయిర్ ఫోర్స్ విమానాన్ని వినియోగించుకునేందుకు అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని,బుధవారం నుంచి ట్యాంకర్లు ఢిల్లీకి చేరుకుంటాయని కేజ్రీవాల్ చెప్పారు. ఇక, ఏప్రిల్-30నాటికి కేంద్రం..ఢిల్లీలో ఎనిమిది ఆక్సిజన్ ఫ్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం మే చివరినాటికి 15ఫ్లాంట్లను ఏర్పాటు చేయనుందని కేజ్రీవాల్ చెప్పారు.

దేశరాజధానిలో ఆక్సిజన్ సంక్షోభాన్ని నివారించేందుకు సహియం అందించాలని పలు రాష్ట్రాల సీఎంలు,పారిశ్రామికవేత్తలకు లేఖలు రాశామని.. ఈ మేరకు వారి నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక,ప్రాణవాయువు రవాణా వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ తొలి రైలు 70 టన్నుల ఆక్సిజన్‌తో ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఈ 70 టన్నులను ఏయో ఆస్పత్రులకు కేటాయించాలనే దానిపై ఢిల్లీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది.