కొత్త ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా స్తంభించిన రవాణా

  • Edited By: madhu , September 19, 2019 / 03:52 AM IST
కొత్త ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా స్తంభించిన రవాణా

ఢిల్లీలో రవాణా వ్యవస్థ సంభించింది. ట్రాన్స్‌పోర్టు యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మోటార్ వెహికల్ యాక్టును నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీ గురువారం సమ్మెను చేపట్టాయి. రవాణా సమ్మెతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాలకు వెళ్లే వారు, ఇతరత్రా పనులపై వెళ్లే వారు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు నిలిచిపోయాయి. సమ్మె ఫలితంగా రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. 

సెప్టెంబర్ 01 నుంచి కొత్త మోటార్ వెహికల్ యాక్టును కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిని పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా..కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలను తగ్గించాయి. భారీగా ఫైన్లు విధిస్తుండడంతో వాహనదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది. వెంటనే సవరణలు మార్చాలని, భారీ పెనాల్టీల నుంచి ఉపశమనం కల్పించాలని ఢిల్లీలోని ట్రాన్స్ పోర్టు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

మొత్తం 41 సంస్థలు, సంఘాలతో కూడదిన రవాణా సంఘాల ఐక్య సమాఖ్య (UFTA) సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రైవేటు వాహన డ్రైవర్లకు బీమా, వైద్య సదుపాయం కల్పించాలని ట్రాన్స్ పోర్టు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 
Read More : ట్రాన్స్‌పోర్టు యూనియన్ల సమ్మె : ఢిల్లీలో స్తంభించిన రవాణా