Delhi : PM మోడీ CM యోగీ భేటీ..ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు.ప్రధాని మోడీ నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నారు.. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సీఎం, యూపీ సీఎంల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. యూపీలోఅసెంబ్లీ ఎన్నికలు. రాష్ట్ర రాజకీయాలు,కరోనా సెకండ్ వేవ్ లో తీసుకున్న చర్యలు. థర్డ్ వేవ్ వస్తుందనే అంచనాలతో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే పలు కీలక అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.

Delhi : PM మోడీ CM యోగీ భేటీ..ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

Up Cm Yogi Meets Pm Modi

UP CM Yogi meets PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు.ప్రధాని మోడీ నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నారు.. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సీఎం, యూపీ సీఎంల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. యూపీలోఅసెంబ్లీ ఎన్నికలు. రాష్ట్ర రాజకీయాలు,కరోనా సెకండ్ వేవ్ లో తీసుకున్న చర్యలు. థర్డ్ వేవ్ వస్తుందనే అంచనాలతో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే పలు కీలక అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.

యూపీలో ఇటీవలి కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రధానిని యోగి కలిశారన్న చర్చ జరుగుతోంది. యూపీ బీజేపీ నేతల్లో అసమమ్మతి అంశాలపై ప్రధానితో యోగి చర్చిస్తున్నారు. కాగా.. బుధవారం (జూన్9,2021) యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ తో సీఎం యోగి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జరిగిన చర్చలు తీసుకున్న నిర్ణయాలు..తీసుకోవాల్సిన అంశాలపై సమావేశానికి సంబంధించిన నివేదికను పార్టీ అధిష్ఠానానికి అందించడం కోసమే యోగి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

కానీ ప్రముఖలు మరో ప్రముఖులతో భేటీ అయిన సందర్భంగా చెప్పే సర్వసాధారణమైన సమాధానాన్నే బీజేపీ నేతలు పీఎం సీఎం కీలక సమావేశం గురించి చెప్పుకొస్తున్నారు. కానీ ఇది చాలా కీలక సమావేశం అనే సమాచారం. ఎందుకంటే సునీల్ బన్సాల్ హెలికాప్టర్ లో హుటాహుటిన లక్నోకు రావడం, సమావేశానికి హాజరు కావడం వంటి పరిణామాలు రాష్ట్రంలో పార్టీ నాయకత్వ మార్పుల కోసమేననే సంకేతాలు వినిపిస్తున్నాయి.

యూపీలో కరోనాన కట్టడి చేసే విషయంలో సీఎం యోగి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఘంటాపథంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అటు సునీల్ బన్సాల్ యోగీ భేటీ అనంతరం వెంటనే ప్రధాని మోడీతో సమావేశం మాత్రం సాధరణమైనది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పీఎం సీఎంల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా..యోగీ ఆదిత్యానాథ్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదటిరోజు గురువారం (జూన్ 10,2021) కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. రెండోరోజు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.ఈ రెండు భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.