వావ్ : 30 ఏళ్లుగా మూతబడిన ఆమె నోరు తెరుచుకుంది..!!

వావ్ :  30 ఏళ్లుగా మూతబడిన ఆమె నోరు తెరుచుకుంది..!!

Delhi Woman Mouth Closed For 30 Years Is Now Open

Delhi woman mouth closed for 30 years :  ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళ నోరు 30ఏళ్లుగా తెరుచుకోలేదు. ఆమె వయస్సు కూడా 30ఏళ్లే కావటం విశేషం. అంటే ఆమె పుట్టినప్పటినుంచి నోరు తెరుచుకోనేలేదు. కానీ ఇన్నేళ్లకు ఆమె నోటిని తెరిపించారు డాక్టర్లు. అరుదైన సర్జరీ చేసి ఆమె నోరు తెరిపించారు ఢిల్లీలోని సర్ గంగారామ్ డాక్టర్లు. దీంతో 30 ఏళ్లుగా మూతబడిన ఆమె నోరు తెరుచుకుంది.ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి డాక్టర్లు అత్యంత క్లిష్టమైన సర్జరీ చేసి.. బాధితురాలికి కొత్త జీవితం ప్రసాదించారు.

ఆస్థా అనే ఈ మహిళ పుట్టుకనుంచే పలు శారీరక సమస్యలను ఎదుర్కొంటోంది. దాంట్లో ఆమె నోరు తెరుచుకోకపోవటం ఒకటి. ఆమె దవడ ఎముక నోటి ఇరువైపుల నుండి వెళ్లి పుర్రె ఎముకకు అతుక్కుపోవటంతో ఆమె నోరు తెరుచుకునేది కాదు. దీంతో ఆమె పుట్టుకతోనే నోటిని తెరవలేకపోయేది. కనీసం తన వేలితో నాలికను కూడా తాకలేని పరిస్థితిలో చాలా బాధపడేది. ఇన్నాళ్లూగా ఆస్థా నోరు తెరుచుకోకపోవటంతో ఆమె కేవలం ద్రవ పదార్థాలు తీసుకుంటూ మాత్రమే జీవించింది. మరోవైపు నోటి సమస్య వల్ల ఆమె ఇన్ ఫెక్షన్ తో దంతాలు కూడా పాడయిపోయాయి. అంతేకాదు పుట్టుకతో వచ్చిన పలు సమస్యల మరొకటి ఆమెకు ఒక కన్ను కూడా కనిపించకపోవటం.

ఇన్ని సమస్యల వల్ల ఆమె ముఖం అందవికారంగా కనిపించేది. ఫలితంగా శస్త్ర చికిత్సలకు కూడా అందని విధంగా ఆమె పరిస్థితి ఉండేది. ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు సర్ గంగారామ్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. డాక్టర్లు ఆమెకు అత్యంత క్షిష్టమైన సర్జరీ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ, రేడియాలజీ విభాగం డాక్టర్లు సంయుక్తంగా ఆమెకు మూడు గంటల పాటు సర్జరీ చేశారు. మార్చి 20న ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స తరువాత గత గురువారం అంటే మార్చి 25న కోలుకుని డిశ్చార్జ్ అయ్యింది. ఇప్పుడు ఆమె తన నోటిని కొద్దిగా తెరవగలుగుతోంది. ఫిజియో థెరపీ, వ్యాయామాల ద్వారా ఆమె నోరు మరింతగా తెరుచుకునేందుకు అవకాశముందని నిపుణులు తెలిపారు. దీంతో ఆమె ప్రతీ రోజు ఫిజియో థెరపీ చేయాల్సి ఉంది.

ఈ సర్జరీ గురించి డాక్టర్ల బృందంలో డాక్టర్ రాజీవ్ అహుజా మాట్లాడుతూ..ఆమెకు సర్జరీ చేసే సమయంలో చాలారక్త స్రావం జరిగిందనీ..ఆమె ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందనే భయం కూడా ఉందని తెలిపారు. సర్జరీ ఏమాత్రం చిన్న మార్పు జరిగినా ఆమె ప్రాణాలు పోయే స్థితిలో అత్యంత అప్రమత్తంగా మూడున్నర గంటల పాటు సర్జరీ చేశామని ఇప్పుడు ఆమె కాస్త కోలుకుంది. తన నోటిని రెండుననర సెంటీమీటర్ల నోరు తెరువగలుగుతోందని తెలిపారు.