Cab Driver :  క్యాబ్‌ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించిన మహిళ

ఢిల్లీలో నడిరోడ్డుపై ఓ మహిళ వీరంగం సృష్టించింది. క్యాబ్ డ్రైవర్ ను బయటకు గుంజి అతడిపై దాడి చేసింది. పక్కన వారు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని దూషించింది మహిళ

Cab Driver :  క్యాబ్‌ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించిన మహిళ

Cab Driver

Cab Driver :  క్యాబ్ డ్రైవర్‌పై మహిళ చేయిచేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు మహిళలు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.. వీరిముందు ఓ కారు వెళ్తుంది. ఇదే సమయంలో సైడ్ ఇవ్వాలంటూ వెనుకనుంచి హారన్ వేశారు .. రోడ్డు రద్దీగా ఉండటంతో సైడ్ ఇవ్వలేకపోయాడు క్యాబ్ డ్రైవర్. దీంతో ఆగ్రహించిన మహిళ కారువద్దకు వచ్చి డ్రైవర్‌ను బయటకు లాగింది.

చదవండి : Lucknow Cab Driver : బయటపడ్డ నిజం.. క్యాబ్‌ డ్రైవర్‌‌ను చెంపదెబ్బ కొట్టిన యువతి ఘటనలో ట్విస్ట్‌

ఆనంతరం అతడి చొక్కాపట్టుకొని దూషిస్తూ చెంపపై కొట్టింది. అక్కడ ఉన్నవారు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని కూడా దూషించింది. మహిళ దాడి చేస్తున్నప్పటికి ప్రతిఘటించకుండా అలానే ఉండిపోయాడు క్యాబ్ డ్రైవర్. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్‌లో బంధించారు.. ఆదిత్య సింగ్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్టు చేసి ఈ ఘటన చూసి తాను చాలా బాధపడినట్లు అందులో పేర్కొన్నారు.

చదవండి : Cab Drivers : యువతిపై లైంగిక దాడికి యత్నించిన క్యాబ్ డ్రైవర్లు

ఇక ఈ ఘటనపై పోలీసులను ప్రశ్నించగా తమకు సమాచారం లేదని.. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. బైక్ నంబర్ ఆధారంగా దాడిచేసిన మహిళను గుర్తిస్తామని తెలిపారు.