రైతుల నిరసన ర్యాలీ :యూపీ-ఢిల్లీలో బోర్డర్ లో ట్రాఫిక్ జామ్ 

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 09:21 AM IST
రైతుల నిరసన ర్యాలీ :యూపీ-ఢిల్లీలో బోర్డర్ లో ట్రాఫిక్ జామ్ 

ఉత్తరప్రదేశ్ రైతుల నిరసన ర్యాలీ చేపట్టారు. వీరంతా ఢిల్లీవైపుగా ర్యాలిని కొసాగించారు. భార‌తీయ కిసాన్ సంఘ‌ట‌న ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ ర్యాలీ ఢిల్లీలోని కిసాన్ ఘాట్ దిశ‌గా సాగుతోంది. చెరుకు పంట బకాయిలు చెల్లించాల‌ని..ఇత‌ర పంట‌ల‌కు రుణ‌మాఫీని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ తో ఈ నిరసన కార్యక్రం చేపట్టారు. వీరి ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ఢిల్లీ-యూపీ బోర్డ‌ర్ సమీపంలోని ఘాజీపూర్‌లో పోలీసులు భారీగా మోహరించారు.

కిసాన్ ఘాట్ వైపు వ‌స్తున్న రైతుల‌ను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. త‌మ డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం అంగీకారం తెలిపితే, తాము అక్కడి నుంచి తిరిగి వెన‌క్కి వెళ్లిపోతామని లేకుంటే నిరసన ర్యాలీని కొనసాగిస్తామని భార‌తీయ కిసాన్ సంఘ్ అధ్య‌క్షుడు పురాన్ సింగ్ తెలిపారు. ఈ క్రమంలో రైతుల నిరసన ప్రదర్శన కారణంగా ఢిల్లీ-యూపీ బోర్డర్ సమీపంలోని ఖాజీపూర్ ఫ్లైఓవర్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.